AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బెట్టింగ్ యాప్‌కు కానిస్టేబుల్ బలి..! పోలీస్ స్టేషన్‌లోని పిస్టల్ తీసుకొని అకస్మాత్తుగా..

బెట్టింగ్ యాప్‌లు, ఆన్‌లైన్ గేమ్‌లు ఎంతోమంది ప్రాణాలు తీస్తున్నాయి.. వాటి జోలికి వెళ్ళొద్దని ఎన్నిసార్లు.. చెప్పినా కొంతమంది మాత్రం అస్సలు మారడం లేదు. కష్టపడి సంపాదించిన డబ్బులతో పాటు ఆస్తులు అమ్ముకుంటున్నారు.. చివరికి ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు.. ఇలాంటి ఘటనే తాజాగా తెలంగాణలోని సంగారెడ్డిలో చోటు చేసుకుంది..

Telangana: బెట్టింగ్ యాప్‌కు కానిస్టేబుల్ బలి..! పోలీస్ స్టేషన్‌లోని పిస్టల్ తీసుకొని అకస్మాత్తుగా..
Sangareddy Constable Commit
P Shivteja
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Nov 03, 2025 | 8:00 PM

Share

బెట్టింగ్ యాప్‌లు, ఆన్‌లైన్ గేమ్‌లు ఎంతోమంది ప్రాణాలు తీస్తున్నాయి.. వాటి జోలికి వెళ్ళొద్దని ఎన్నిసార్లు.. చెప్పినా కొంతమంది మాత్రం అస్సలు మారడం లేదు. కష్టపడి సంపాదించిన డబ్బులతో పాటు ఆస్తులు అమ్ముకుంటున్నారు.. చివరికి ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు.. ఇలాంటి ఘటనే తాజాగా తెలంగాణలోని సంగారెడ్డిలో చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే బెట్టింగ్ భూతం కానిస్టేబుల్‌ను బలిగొంది.. ఈ సంఘటన సంగారెడ్డి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కలకలం రేపింది. చిన్న, పెద్ద ఉద్యోగస్తులు, నిరుద్యోగులు అంటూ ఎటువంటి తేడా లేకుండా ఈ బెట్టింగ్ భూతం ఆఖరికి పోలీసు వ్యవస్థను కూడా తాకింది.. చేతికి అందిన కొడుకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారాన్న సంతోషం ఆ కుటుంబానికి ఎక్కువ రోజులు లేకుండా చేశాయి.. వివరాల ప్రకారం.. కల్హేరు మండల కేంద్రానికి చెందిన సందీప్ కి గత సంవత్సరం కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అతను సంగారెడ్డిలోని టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు.. సందీప్ కు చిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగం రావడంతో, ఆ కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషించారు.. కానీ సందీప్ లోన్ యాప్, బెట్టింగ్ గేమ్ లకు అలవాటు పడి తన ప్రాణాన్ని తీసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు..

సందీప్ పట్టుదలతో చదివి 2024 బ్యాచ్ లో కానిస్టేబుల్ గా ఉద్యోగాన్ని సంపాదించి సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు.. విధుల్లో కూడా ఎప్పుడు చురుగ్గా ఉండేవాడు.. కాగా గత రెండు రోజులుగా సందీప్ ముభావంగా ఉంటున్నాడని, ఎప్పుడు ఏదో తెలియని భయంతో ఉండేవారని తోటి ఉద్యోగులు చెప్పుకొచ్చారు.. ఏం జరిగిందో తెలియదు.. ఈ రోజు పోలీస్ స్టేషన్ లోని ఆమ్స్ బెల్ నుంచి పిస్టల్ తీసుకొని సంగారెడ్డి కేంద్రంలోని మహబూబ్ సాగర్ వద్ద సాయంత్రం నాలుగు గంటల సమయంలో తన ఛాతీపై తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు.

బెట్టింగ్ వల్లే చనిపోయారని ప్రచారం జరుగుతున్నా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.. మృతునికి తల్లి, చెల్లి మాత్రమే ఉన్నారు.. సందీప్ వార్త విన్న కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..