BDL Hyderabad Jobs 2023: హైదరాబాద్‌లోని ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ.1,60,000 జీతంతో కేంద్ర కొలువులు

|

Jun 02, 2023 | 1:27 PM

హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌).. 12 డిప్యూటీ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ షాట్‌ నోటిఫికేషన్‌ విడుదల..

BDL Hyderabad Jobs 2023: హైదరాబాద్‌లోని ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ.1,60,000 జీతంతో కేంద్ర కొలువులు
BDL Hyderabad
Follow us on

హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌).. 12 డిప్యూటీ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ షాట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీఎస్‌ఎస్‌ఐ డిజైనర్‌/ ఎంబడెడ్‌ డిజైనర్‌, మైక్రోవేవ్‌ డిజైనర్‌, కంప్యూటర్‌ విజన్‌ సాఫ్ట్‌వేర్‌ డిజైనర్‌, సీఏఈ/ ఎఫ్‌ఈఏ ఇంజినీర్‌, క్యూసీ మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఆసక్తి, అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జులై 16, 2023వ తేదీ రాత్రి 11 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జూన్ 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.40,000ల నుంచి రూ.1,60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. నియామక విధానం, వయోపరిమితి వంటి ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.