Hyderabad : హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి.. బాలానగర్ వాసులకు తీరనున్న ట్రాఫిక్ కష్టాలు..
Hyderabad : హైదరాబాద్‌లో ట్రాఫిక్ అంటే మామూలుగా ఉండదు. నగరవాసులు నరకయాతన అనుభవిస్తూ
Hyderabad : హైదరాబాద్‌లో ట్రాఫిక్ అంటే మామూలుగా ఉండదు. నగరవాసులు నరకయాతన అనుభవిస్తూ ప్రయాణించాల్సిందే. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు ఎవ్వరైనా కానీ ట్రాఫిక్ జాంలో ఇరుక్కున్నారంటే చాలు గంటల తరబడి వెయిట్ చేయాల్సిందే. కానీ ఇప్పుడు కొంచెం కొంచెంగా పరిస్థితులు మారుతున్నాయి. నగరంలో విస్తృతంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ల వల్ల కొంతవరకు ట్రాఫిక్ కష్టాలకు ఉపశమనం దొరుకుతుంది. అంతేకాకుండా హైదరాబాద్ మెట్రో వల్ల కూడా కొంత ట్రాఫిక్ తగ్గుతోంది.
తాజాగా హైదరాబాద్ నగర వాసులకు మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి కావడంతో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. జులై మొదటి వారంలో దీన్ని ప్రారంభించనున్నారు. బాలానగర్ చౌరస్తా అంటే ట్రాఫిక్ మామూలుగా ఉండదు. సిగ్నల్ పడిందంటే కిలోమీటర్ వరకు వాహనాలు నిలిచిపోవాల్సిందే. అలాంటిది ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కావడంతో ట్రాఫిక్ కష్టాలు తీరినట్లయింది. 2017లో మంత్రి కేటీఆర్ చేతులమీదుగా రూ.387 కోట్లతో శంకుస్థాపన చేయగా.. మూడున్నర ఏళ్లకు నిర్మాణం పూర్తయింది.
ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకుని మంత్రి కేటీఆర్ రూ.387 కోట్లతో 2017లో శంకుస్థాపన చేయగా.. కరోనా నేపథ్యంలో నిర్మాణానికి సుమారు మూడున్నరేళ్లు పట్టింది. 1.13 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ ఫ్లై ఓవర్ ఆరు లేన్లతో ఎస్‌ఆర్డీపీ సౌజన్యంతో హెచ్‌ఎండీయే నిర్మించింది. బోయిన్‌పల్లి నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండు సిగ్నళ్లను కలుపుతూ నిర్మాణం చేపట్టారు. జీడిమెట్ల వైపు వెళ్లే వారికి సైతం ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి.