AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. మొండి బకాయిల చెల్లింపునకు జీహెచ్ఎంసీ సిద్ధం

జీహెచ్ఎంసీ(GHMC)లో పన్ను బకాయిల వసూలుకు ప్రభుత్వం సిద్ధమైంది. గ్రేటర్‌ పరిధిలో ఆస్తి పన్ను మొండి బకాయిలను వసూలు చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్కీమ్....

Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. మొండి బకాయిల చెల్లింపునకు జీహెచ్ఎంసీ సిద్ధం
Ghmc
Ganesh Mudavath
|

Updated on: May 15, 2022 | 7:09 AM

Share

జీహెచ్ఎంసీ(GHMC)లో పన్ను బకాయిల వసూలుకు ప్రభుత్వం సిద్ధమైంది. గ్రేటర్‌ పరిధిలో ఆస్తి పన్ను మొండి బకాయిలను వసూలు చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్కీమ్ పథకం కింద ఈ బకాయిల వసూలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పథకాన్ని వారం రోజుల్లోపు రాష్ట్ర పురపాలక శాఖ ప్రకటించనుంది. అందులో భాగంగా పురపాలకశాఖ అధికారులు జీహెచ్ఎంసీ నుంచి వివరాలు తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 17.5 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. అందులో 2 నుంచి 3 లక్షల మంది కొన్నేళ్లుగా పన్ను కట్టట్లేదు. వారి నుంచి వసూలు కావాల్సిన మొత్తం బకాయి వడ్డీతో కలిపితే రూ.1,500కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. వడ్డీని గతంలో మాదిరి 90శాతం మాఫీ చేస్తే.. డిమాండు రూ.1000కోట్లకు తగ్గనుంది. అయితే మూతపడ్డ పరిశ్రమలు, కోర్టు వివాదాల్లోని ఆస్తులు, రోడ్డు విస్తరణలో కూల్చిన భవనాలు, ఇతరత్రా నిర్మాణాలు వాస్తవంగా కనిపించవు. కానీ రికార్డుల్లో వాటి పేర్లు అలాగే కొనసాగుతున్నాయి. వాటి వివరాలను మార్చక పోతే అవి మొండి బకాయిలుగా మారుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఫలితంగా పన్ను చెల్లింపుదారుల జాబితా పక్కాగా తయారవుతుందని, ఎంత పన్ను రావాలి, ఎంత బకాయి ఉందనే గణాంకాలు స్పష్టంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఆగస్టు 1, 2020న ప్రభుత్వం ఓటీఎస్‌ పథకాన్ని ప్రవేశపెట్టగా రూ.550కోట్ల మేర పన్ను వసూలైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో మొత్తం రూ.2వేల కోట్ల ఆస్తిపన్ను వసూలు చేయాలని జీహెచ్‌ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇదీ చదవండి

Fenugreek: మెంతులతో చుండ్రు సమస్యలకి చెక్‌.. ఈ విధంగా చేయండి..!