IPL 2022 Points Table: ప్లే ఆఫ్ రేసులోకి దూసుకొచ్చిన కోల్‌కతా.. పాయింట్ల పట్టికలో దిగజారిన హైదరాబాద్..!
IPL 2022 Points Table: ఐపీఎల్ సీజన్‌లో మరోసారి ప్లేఆఫ్ రేసు రచ్చ కొనసాగుతోంది. కొత్తలో రేసులో ముందున్న జట్లు వెనకబడగా నిలదొక్కుకునేందుకు తంటాలు పడిన జట్లు ప్లే ఆఫ్‌లోకి
IPL 2022 Points Table: ఐపీఎల్ సీజన్‌లో మరోసారి ప్లేఆఫ్ రేసు రచ్చ కొనసాగుతోంది. కొత్తలో రేసులో ముందున్న జట్లు వెనకబడగా నిలదొక్కుకునేందుకు తంటాలు పడిన జట్లు ప్లే ఆఫ్‌లోకి దూసుకొస్తున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఈ విషయంలో ముందంజలో ఉంది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ విజయం సాధించి ఎలిమినేట్ అయ్యే ప్రమాదాన్ని తప్పించుకుంది. శనివారం మే 14న కోల్‌కతా 54 పరుగుల భారీ తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది.
12 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్. ఈ పరిస్థితిలో బిగ్గెస్ట్ స్టార్ ఆండ్రీ రస్సెల్ తన మ్యాజిక్ ప్రదర్శించి ఒంటరిగా జట్టుని విజయతీరాలకి చేర్చాడు. కేవలం 28 బంతుల్లో 49 పరుగులు చేసిన రస్సెల్ తర్వాత హైదరాబాద్ 3 వికెట్లు పడగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. కోల్‌కతా తరఫున అత్యధిక పరుగులు చేయడంతో పాటు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
ఈ విజయంతో కోల్‌కతా13 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లు సాధించి రేసులో కొనసాగుతోంది. ఈ విజయంతో 2 పాయింట్లు సాధించడంతో పాటు నెట్ రన్ రేట్ కూడా మెరుగుపరుచుకుంది. ఫలితంగా జట్టు ఆరో స్థానానికి చేరుకుంది. గతంలో ఏడో స్థానంలో ఉన్న హైదరాబాద్ ఇప్పుడు ఎనిమిదో స్థానానికి పడిపోయింది. 12 మ్యాచ్‌లలో 10 పాయింట్లు మాత్రమే కలిగి ఉంది. వరుసగా ఐదో ఓటమితో జట్టు NRR మరింత దిగజారింది. హైదరాబాద్ ఇప్పుడు ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే చివరి రెండు మ్యాచ్‌లను ఎలాగైనా గెలవాలి.
ఈ ఫలితం తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌పై ఒత్తిడి పెరిగింది. రాజస్థాన్, బెంగళూరు జట్లకు 14 పాయింట్లు ఉండగా, రాజస్థాన్‌కు రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. బెంగళూరుకు ఒక్క మ్యాచ్ మాత్రమే ఉంది. అదే సమయంలో ఢిల్లీ, కోల్‌కతా జట్ల మధ్య 12 పాయింట్లు ఉండగా, ఢిల్లీకి రెండు మ్యాచ్‌లు, పంజాబ్ కింగ్స్‌కు రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇవి కూడా 12 పాయింట్లతో కొనసాగుతున్నాయి.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి