ముస్లిం జనాభా పెరుగుదలపై వస్తున్న రాజకీయ విమర్శలకు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ గెలిస్తే.. ఎక్కువమంది పిల్లలు ఉన్న వారికి, చొరబాటుదారులకు సంపదను పంపిణీ చేస్తారంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ అసదుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాలంలో జనాభా నియంత్రణకు ముస్లింలు ఎక్కువగా కండోమ్‌లు వాడుతున్నారని.. ఈ విషయం చెప్పడానికి తనకు సిగ్గు అనిపించడం లేదన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఒక ర్యాలీలో మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
“ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటారన్న భయాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు? ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ముస్లింలలో జనాభా పెరుగుదల, సంతానోత్పత్తి తగ్గింది. ముస్లింలు కండోమ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.. ఈ విషయం చెప్పడానికి నాకు సిగ్గు అనిపించడం లేదు..” అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముస్లింలు మెజారిటీ కమ్యూనిటీ అవుతారని హిందువులలో భయాన్ని కలిగిస్తున్నారు.. ఎంతకాలం ముస్లింల గురించి చెప్పి భయాన్ని సృష్టిస్తారు? మా మతం వేరు.. కానీ మేము ఈ దేశానికి చెందినవాళ్ళమే.. అంటూ అసదుద్దీన్ పేర్కొన్నారు.
‣ @narendramodi की एक ही गारंटी है, दलितों और मुसलमानों से नफ़रत करो।
‣ एक मुल्क का वज़ीर-ए-आज़म इस मुल्क की 15 फ़ीसद अवाम को घुसपैठिया कहता है, इससे शर्मनाक बात कुछ और नहीं हो सकती। pic.twitter.com/87mIdAfiAi
— Asaduddin Owaisi (@asadowaisi) April 27, 2024
అటు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ముస్లిం జనాభా గణాంకాలు, రిజర్వేషన్ల బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రధాని మోదీతోపాటు.. మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ ప్రధాన్యత సంతరించుకుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..