CM KCR – Asaduddin Owaisi: ఇద్దరూ మంచి స్నేహితులే.. ఇద్దరి మధ్య అంతకుమించి అన్నంత అనుబంధం ఉంది.. పక్కా రాజకీయ ఒప్పందమూ ఉంది.. కాకపోతే సందర్భాన్ని బట్టి ఒకరిని మించి ఒకరు కామెంట్లు చేసుకోవడం పొలిటికల్ కామన్ స్టైల్.. బయటకు ఎలా ఉన్నా.. లోలోపల ఇద్దరూ ఒక్కటే అన్నది తెలుస్తోంది.. మొన్న బీఆర్ఎస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ సందర్భంలోనూ ఎంఐంఎంతో తమకున్న సంబంధాన్ని సీఎం కేసీఆర్ ఓపెన్‌గా చెప్పారు. ఈ క్రమంలో ఇప్పుడు సెక్రటేరియట్ ఆవరణంలో కేసీఆర్‌పై ఉన్న అభిమానాన్ని అసదుద్దీన్ మరోసారి చాటుకున్నారు. సెక్రటేరియట్ సాక్షిగా బీఆర్ఎస్, ఎంఐఎం బంధం మరోసారి బయటపడటం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ సచివాలయం ఆవరణలో శుక్రవారం దేవాలయం, చర్చి, మసీదుల ప్రారంభోత్సవం జరిగింది. సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు నిర్మించిన ప్రార్థనా మందిరాలను గవర్నర్ తమిళిసైతో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా పాల్గొన్నారు. దేశ చరిత్రలో సచివాలయంలో మసీద్, మందిర్, చర్చి నిర్మించారని కేసీఆర్‌ను అసద్ ప్రశంసించారు. మైనార్టీలకు కావాల్సినంత చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని జోస్యం చెప్పారు. ఇదేంటి సార్ అంటే.. రాజకీయం రాజకీయమే అంటూ అసదుద్దీన్ సింపుల్‌గా సమాధానమిచ్చారు.
సాధారణంగా.. ప్రతిపక్షాల కంటే కేసీఆర్‌కు ఇలాంటివి బాగా తెలుసు.. అసద్ మనసులో ఏముందో కేసీఆర్‌కు తెలియదా..? అనే వారు కూడా ఉన్నారు. అందుకే అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసిన సమయంలో.. ఎంఐఎంతో కలిసి పోటీ చేస్తామని.. తమ మధ్య మంచి ఒప్పందముందని స్వయానా ముఖ్యమంత్రే చెప్పారు. ఈ క్రమంలో అసదుద్దీన్ కూడా కేసీఆర్ పై ఉన్న అభిమానాన్ని వ్యక్తపరచడం ఆసక్తికరంగా మారింది.
ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ – ఎంఐఎం అనుబంధం మరింత బలపడటం పొలిటికల్ గా కలిసి వచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన కేసీఆర్.. వ్యూహాలకు మరింత పదునుపెడుతున్న విషయం తెలిసిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..