AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Court New Judge: తెలంగాణ హైకోర్టుకు కొత్త జడ్జి.. గతంలో ఎక్కడ పనిచేశారంటే..?

తెలంగాణ హైకోర్టుకు కొత్త చీఫ్ జస్టిస్‌ను నియమించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. దేశంలోని పలువురు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు కోలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో.. పలువురు ప్రధాన న్యాయమూర్తులను వివిద హైకోర్టులకు బదిలీ చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

High Court New Judge: తెలంగాణ హైకోర్టుకు కొత్త జడ్జి.. గతంలో ఎక్కడ పనిచేశారంటే..?
Aparesh Kumar Singh
Anand T
|

Updated on: Jul 14, 2025 | 10:18 PM

Share

దేశంలో మరోసారి పలువురు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలు జరిగాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను మార్చేందుకు సుప్రీంకోర్టు కొలీజియం ఇచ్చిన సిఫార్సులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించడంతో వివిధ రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులను బదిలీచేస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టుతో పాటు పలు రాష్ట్రాల హైకోర్టులకు కేంద్రం కొత్త న్యాయమూర్తిలను నియమించింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ కేంద్రం నియమించింది.

ఇదువరకు త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తాజా ఉత్తర్వులతో తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. కాగా త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా ఝార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎం. ఎస్. రామచంద్రరావును బదిలీ అయ్యారు. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కే. ఆర్. శ్రీరామ్‌ను రాజస్థాన్‌కు బదిలీ చేశారు. రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ మణింద్ర మోహన్ శ్రీవాస్తవను కేంద్రం మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేసింది. ఇక మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బట్టు దేవానంద్‌ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈయన ఏపీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం ఇది రెండోసారి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.