హైదరాబాద్‌లో జనసేనాని పవన్‌‌తో సోమువీర్రాజు భేటీ.. అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కలిసి పని చేయాలని నిర్ణయం

|

Jan 24, 2021 | 6:57 PM

హైదరాబాద్‌కు వచ్చిన సోమువీర్రాజు.. పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు.

హైదరాబాద్‌లో జనసేనాని పవన్‌‌తో సోమువీర్రాజు భేటీ.. అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కలిసి పని చేయాలని నిర్ణయం
Follow us on

Veerraju meet Pavan Kalyan : జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌తో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు భేటీ అయ్యారు. అమరావతి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన పవన్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. తిరుపతి ఎంపీ అభ్యర్ధి, ఎపీలో రాజకీయ పరిస్థితులపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఇరువురూ సుమారు అరగంటకు పైగా చర్చించారు.తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో అభ్యర్ధి పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా, ఉభయ పార్టీల అభ్యర్ధిగా బరిలో దిగాలని ఇప్పటికే నిర్ణయించారు. భేటీ అనంతరం సోమువీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో అభ్యర్ధిపై చర్చించామన్నారు. ‘ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఉభయ పార్టీల పార్టీల అభ్యర్ధిగా బరిలో దిగుతారు. ఉభయపార్టీల అభ్యర్ధి విజయం సాధించే దిశగా ఈ సమావేశంలో ప్రణాళికలు సిద్దం చేశామన్నారు.


మరోవైపు 2024లో బీజేపీ, జనసేన సంయుక్తంగా ఏపీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. దీనికి తిరుపతి ఉప ఎన్నికనే పునాది కావాలని భావిస్తున్నాం. అందుకోసం తిరుపతి ఉప ఎన్నికలో తమ అభ్యర్థి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించనున్నాయి రెండు పార్టీలు. దీని కోసం ప్రచార వ్యూహంపై ఇద్దరు అధినేతల మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఇరు పార్టీల మధ్య ఎలాంటి సమన్వయలోపం లేకుండా జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తుంది. కుల, మత వర్గాల బేధాలు లేకుండా అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కలిసి పయనిస్తాం’ అని వీర్రాజు చెప్పుకొచ్చారు.

Read Also….  కోవిడ్ వ్యాక్సిన్ పట్ల అపోహలు వద్దు.. ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలిః గవర్నర్ తమిళసై