AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP, Telangana News Live: ఆసియా కప్ నుంచి పాకిస్తాన్ ఔట్..! ఏం జరిగిందంటే..?

సెప్టెంబర్ 17 ఫ‌క్తు పొలిటికల్‌ డేగా మారిపోయింది. రెండు శతాబ్దాల నిజాం పాలనకు తెరపడి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సెప్టెంబర్‌ 17పై రాజకీయ దుమారం రగులుతూనే ఉంది. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో నినాదంతో వేడుకలు నిర్వహిస్తూ… పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నాయి. ఇంతకీ ఏ పార్టీ విధానం ఏంటి..?

AP, Telangana News Live: ఆసియా కప్ నుంచి పాకిస్తాన్ ఔట్..! ఏం జరిగిందంటే..?
Ravi Kiran
| Edited By: Srilakshmi C|

Updated on: Sep 17, 2025 | 10:10 PM

Share

హైదరాబాద్‌ సంస్థానం నిజాం నుంచి దేశంలో అంతర్భాగమైన తేదీకి ఒక్కో పార్టీ ఒక్కో భాష్యం చెబుతూ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఒకరు విలీనం అంటే.. ఇంకొకరు విమోచనం.. మరొకరు సమైక్యత దినం అంటూ కార్యక్రమాలకు రెడీ అయ్యారు. ఇది ముమ్మాటీకి తెలంగాణ విమోచన దినోత్సవమే అంటూ వేడుకలకు రెడీ అయింది బీజేపీ. కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రెండేళ్లుగా రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్న బీజేపీ.. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటిలాగా గాంధీభవన్‌లో విలీనదినం వేడుకలు జరపనుంది. జిల్లా కేంద్రాల్లో కూడా విలీనదినం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మరోవైపు సెప్టెంబర్ 17న ప్రతి సంవత్సరం సమైక్యత దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తోంది బీఆర్‌ఎస్‌. ఇటు ఎంఐఎం కూడా బీఆర్‌ఎస్‌ బాటలోనే సెప్టెంబర్ 17న ప్రతి ఏడాది సమైక్యతా దినాలు నిర్వహిస్తోం వస్తుంది.

అటు 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రధాని మోదీకి, దేశవ్యాప్తంగా ప్రజల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వారణాసిలో ప్రధాని పుట్టినరోజు సందర్భంగా అభిమానులు గంగనదికి హారతి ఇచ్చారు.. ఆయన మరింత ఆయుష్షు, ఆరోగ్యంతో ఉండాలని పూజలు చేశారు. అటు పూరీకి చెందిన ఓ శాండ్‌ ఆర్టిస్ట్ ప్రధానికి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతా అద్భుత సైకత శిల్పం గీశాడు.. మోదీ శాండ్‌ ఆర్ట్ ఆయన అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ఇవాళ ప్రధాని మోదీ తన పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో పర్యటిస్తారు. ఇక్కడ దేశంలోని మొట్టమొదటి PM మిత్రా పార్క్‌కు శంకుస్థాపన చేసి, ‘సేవా పఖ్వాడా’ను ప్రారంభిస్తారు. ‌

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 Sep 2025 08:25 PM (IST)

    గుంటూరులో డయేరియా కలకలం.. ఆస్పత్రిలో 30 మంది చేరిక

    గుంటూరు నగరంలో వాంతులు, విరోచనాలతో జనాలు అస్పత్రికి వరుస పెడుతున్నారు. పాత గుంటూరు, ఆర్టీసీ కాలనీ రెడ్లబజార్, బుచ్చయ్య తోట నల్లచెరువు, రెడ్డిపాలెం నుండి ఆస్పత్రులకు బాధితులు క్యూ కడతున్నారు. డయేరియా అనుమానిత లక్షణాలతో 30 మందికి జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. ప్రత్యేక వార్డులో బాధితులను ఉంచి చికిత్స అందిస్తున్న వైద్యులు. మూడు రోజుల నుంచి జిజిహెచ్ క్యూ కడుతున్న బాధితులు. ఒకరి పరిస్థితి విషమం.. మరో ఇద్దరికి తీవ్ర అస్వస్థతగా ఉన్నట్లు జిజిహెచ్ సూపరింటిండెంట్ రమణ యశస్వి తెలిపారు. వాంతులు విరోచనాలతో బాధితులు జిజిహెచ్ కు వస్తున్నట్లు తెలిపారు. అందరిని ఒక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు. అందరి ఆరోగ్యం నిలకడగానే‌ ఉందని తెలిపారు. డయేరియా లక్షణాలు ఇప్పటివరకూ కనిపించలేదన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దు… మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.

  • 17 Sep 2025 07:46 PM (IST)

    ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ లీగ్.. తలపడనున్న పొలిటికల్, సినిమా, టీవీ, బిజినెస్ జట్టులు

    అక్టోబర్ 9,10 తేదీల్లో ఉప్పల్ స్టేడియంలో ఎలైట్ క్రికెట్ లీగ్. ఎలైట్ క్రికెట్ లీగ్ లో పాల్గొననున్న పొలిటికల్, సినిమా, టీవీ, బిజినెస్ జట్టులు. చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలైట్ క్రికెట్ లీగ్. జర్సీని ఆవిష్కరించిన మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి. టాలీవుడ్ తరుపున జెర్సీ లాంచ్ చేసిన హీరోలు తరుణ్, సుధీర్ బాబు. పోలీస్ టీమ్ జెర్సీని లాంచ్ చేసిన సిపి సివి ఆనంద్. పహల్గాం దాడి తరువాత చనిపోయిన కుటుంబాలకు అండగా ఉండేలా ఈ ఛారిటీ మ్యాచ్ నిర్వహణ.

  • 17 Sep 2025 07:16 PM (IST)

    ఆసియా కప్ నుంచి పాకిస్తాన్ ఔట్..! ఏం జరిగిందంటే..?

    భారత్‌తో షేక్ హ్యాండ్ వివాదం చెలరేగడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఆసియా కప్‌లో భాగంగా ఈ రోజు UAEతో పాకిస్తాన్ కు మ్యాచ్ ఉంది. అయితే రిఫరీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని లేదంటే UAEతో మ్యాచ్ ఆడబోమని పాక్‌ డిమాండ్‌ చేసింది. పాక్‌ డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించింది. పాక్ ఐసీసీకి మళ్లీ మెయిల్‌ పంపగా పీసీబీ, ఐసీసీకి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. పాకిస్తాన్ బోర్డు తన జట్టును స్టేడియానికి వెళ్లకుండా ఆపడంతో ఆటగాళ్లంతా హోటల్‌ లోనే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో యూఏఈ మ్యాచ్‌ను పాక్‌ బహిష్కరించే అవకాశం ఉంది.

  • 17 Sep 2025 06:58 PM (IST)

    ‘నా మిత్రుడు పుతిన్‌కు ధన్యవాదాలు..’ ప్రధాని మోదీ ట్వీట్ వైరల్

    ప్రధాని మోదీ 75వ పుట్టిన రోజు సందర్భంగా రాష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ శుభాకాంక్షలు తెలిపారు. మాస్కో – న్యూఢిల్లీ మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ చేసిన వ్యక్తిగత సహకారాన్ని పుతిన్‌ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పుట్టినరోజు శుభాకాంక్షలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్‌ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. తన 75వ పుట్టినరోజు సందర్భంగా ఫోన్ కాల్ చేసి శుభాకాంక్షలు తెలిపినందుకు నా మిత్రుడు, అధ్యక్షుడు పుతిన్‌కు ధన్యవాదాలంటూ ట్వీట్‌ చేవారు.

  • 17 Sep 2025 05:59 PM (IST)

    ఇక డోర్‌ డెలివరీలకు డ్రైవర్‌ రహిత వాహనాలు..

    అబుదాబీ సరికొత్త ఆవిష్కరణ చేసింది. డ్రైవర్‌ రహిత డెలివరీ వాహనాలను పరిచయం చేసింది. మస్దార్‌ సిటీలో పైలట్ ప్రోగ్రామ్‌ కింద ఈ వాహనాలను తొలుత వినియోగంలోకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో ప్రైవేటు సంస్థల సహకారంతో అభివృద్ధి చేసిన ఈ వాహనాలకు అధికారిక నంబరు ప్లేట్‌ అబుదాబీ ప్రభుత్వం మంజూరు చేసింది.

  • 17 Sep 2025 05:54 PM (IST)

    వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ షిప్స్‌.. ఫైనల్‌కు నీరజ్‌ చోప్రా

    వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ షిప్స్‌లో జావెలిన్‌ త్రోలో బల్లెం వీరుడు నీరజ్‌ చోప్రా ఫైనల్‌కు అర్హత సాధించాడు.

  • 17 Sep 2025 05:52 PM (IST)

    అసెంబ్లీ సమావేశాలకు MLAలు అందరూ రావాలి: ఏపీ అసెంబ్లీ స్పీకర్

    రేపట్నుంచి ఏపీలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి రావాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోరుతున్నారు. తమ ప్రాంత సమస్యల పరిష్కారానికి ఇదో సదావకాశమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమీక్షలో తెలిపారు.

  • 17 Sep 2025 05:50 PM (IST)

    4 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు

    ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలలో కొనసాగుతున్న ఐటి అధికారుల సోదాలు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ముంబై, బెంగళూరులలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేసిన క్యాప్సి గోల్డ్. క్యాప్సిగోల్డ్ అనుబంధంగా ఉన్న రిటైల్స్ సంస్థలపై కొనసాగుతున్న ఐటి అధికారుల సోదాలు. కొనుగోలు చేసిన బంగారానికి అమ్మకాలు చేసిన బంగారానికి వ్యత్యాసాలు ఉండడంతో ఐటీ అధికారుల ఫోకస్. సికింద్రాబాద్ లోని కళసిగూడ మహంకాళి స్ట్రీట్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు. సికింద్రాబాద్ లోనే సుమారు 5 ప్రాంతాలలో ఐటి అధికారుల దాడులు.

  • 17 Sep 2025 05:48 PM (IST)

    హైదరాబాద్‌లో గోల్డ్‌ వ్యాపారుల ఇళ్లల్లో ఐటీ దాడులు

    హైదరాబాద్‌ కొనసాగుతున్న ఐటీ అధికారుల సోదాలు. సికింద్రాబాద్ మహంకాళి స్ట్రీట్ లో బంగారు వ్యాపారస్తుల ఇళ్లల్లో ఐటీ సోదాలు. మహంకాళి స్ట్రీట్ లోని పవన్ వర్మ అనే బంగారు వ్యాపారస్తుడి నివాసంలో తెల్లవారుజాము నుంచి ఐటీ సోదాలు. చాలాకాలంగా బంగారు వ్యాపారం చేస్తున్న పవన్ వర్మ. బంగారం క్రయవిక్రయాలతో పాటు ట్రేడింగ్ చేస్తున్న పవన్ వర్మ.. ప్రతి సంవత్సరం తిరుపతి బులియన్ పేరుతో కోట్లాది రూపాయల వ్యాపారం సాగిస్తున్నాడు. చేసిన వ్యాపారానికి సంబంధించి ఐటీ అధికారులకు ట్యాక్స్ చెల్లింపులు. టాక్స్ చెల్లింపులలో అవకతవకలు చోటు చేసుకున్నాయి. మరోవైపు బంగారం కొనుగోల్లలోనూ అవకతవకలు బయటపడ్డాయి. అవకతవకల నేపథ్యంలో సోదాలకు దిగిన ఐటీ అధికారులు. పవన్ వర్మ ఇంట్లోని డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. పన్ను చెల్లింపులు, బంగారం క్రయ విక్రయాలు, బంగారం స్టాక్ రిజిస్టర్లను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు.

  • 17 Sep 2025 05:45 PM (IST)

    సెప్టెంబర్‌ 18, 19 తేదీల్లో సెలవు.. చెత్తలో పారబోసిన 1500 టన్నుల ఉల్లి

    కర్నూలులో రూ. 1.8 కోట్ల విలువైన 1500 టన్నుల ఉల్లిని రైతులు చెత్తలో పారబోశారు. రైతుల నుంచి క్వింటాల్ కేవలం రూ.1200 రూపాయలకు కొనుగోలు చేసిన అధికారులు. వారం రోజులైనా విక్రయించకుండా తరలించకుండా ఉండటంతో మార్కెట్లోనే కుళ్ళిన ఉల్లి. దీంతో కంపు కొట్టకుండా ఉండేందుకు టిప్పర్లలో డంపు యార్డుకు తరలించిన అధికారులు. మార్కెట్లో వందల మెట్రిక్ టన్నుల ఉల్లి స్టాక్. మరోవైపు సెప్టెంబర్‌ 18, 19 తేదీల్లో మార్కెట్‌కు సెలవు ప్రకటించిన అధికారులు. ఆ రోజుల్లో మార్కెట్లో ఉన్న ఉల్లిని బయటకు తరలించేందుకు లేదా వేలం వేసి విక్రయించేందుకు చర్యలు. సెలవు ప్రకటించిన 18, 19 తేదీల్లో ఎమ్మిగనూరు మార్కెట్లో రైతులు విక్రయించుకోవచ్చని అధికారులు వెల్లడి.

  • 17 Sep 2025 05:33 PM (IST)

    తెలంగాణ RTCలో 1743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

    TGSRTCలో 1743 పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్‌ నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో 1000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులున్నాయి. ఈ పోస్టుల భర్తీకి అక్టోబర్‌ 8 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది.

  • 17 Sep 2025 05:08 PM (IST)

    రేపట్నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

    రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం. రేపు ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఉన్నతస్థాయి సమీక్ష. సమీక్షకు హాజరైన సీఎస్‌, డీజీపీ, ఉన్నతాధికారులు. అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట భద్రతపై భేటీలో చర్చ. రేపు ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న ఉభయసభలు.. ప్రశ్నోత్తరాల తర్వాత శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ. శాసనసభ సమావేశాల నిర్వహణపై బీఏసీలో నిర్ణయం.

  • 17 Sep 2025 05:06 PM (IST)

    రాజేంద్రనగర్ మహిళ హత్య కేసులో ట్విస్ట్..!

    రాజేంద్రనగర్ మహిళ హత్య కేసులో పోలీసుల చేతికి కీలక ఆధారాలు లభ్యమైనాయి. దారుణ హత్యకు గురైన యువతిపి నాంపల్లి రేష్మా బేగంగా గుర్తింపు. నాంపల్లి నుంచి రేష్మా బేగం రాజేంద్రనగర్‌కు ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు.

  • 17 Sep 2025 05:04 PM (IST)

    ప్రధాని మోదీ పుట్టినరోజుకు కీరవాణి స్పెషల్ సాంగ్‌..

    ప్రధాని మోదీ పుట్టినరోజుకు ఆయనపై స్పెషల్‌ సాంగ్‌ రిలీజ్‌ చేసిన సంగీత దర్శకుడు కీరవాణి. ఈ పాటను యూట్యూబ్‌లో విడుదల చేసినట్లు వెల్లడి.

  • 17 Sep 2025 05:01 PM (IST)

    ఈవీఎం బ్యాలెట్‌ పేపర్‌లో కీలక మార్పు.. EC సంచలన నిర్ణయం

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు స్పష్టత పెంచడానికి EVM బ్యాలెట్ పేపర్లలో ఎన్నికల సంఘం బుధవారం కీలక మార్పులు చేసింది. ఇకపై EVMలలో అభ్యర్థుల కలర్‌ ఫొటోగ్రాఫ్‌తో జాబితా పెట్టనుంది. ఇది బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నుంచే అమలు చేయనున్నట్లు ప్రకటన. అలాగే అభ్యర్థుల సీరియల్ నంబర్లను ముద్రించాలని, చదవడానికి వీలుగా అభ్యర్థుల పేరును ఒకే ఫాంట్ రకంలో, పెద్ద ఫాంట్ పరిమాణంలో ముద్రించాలని కూడా EC ఆదేశించింది. దీనిలో భాగంగా EVM బ్యాలెట్ పత్రాలను 70 GSM పేపర్‌పై ముద్రించనున్నారు. ఈ మేరకు బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు RGB కలిగిన గులాబీ రంగు కాగితాన్ని ఉపయోగిస్తున్నట్లు EC తెలిపింది. అప్‌గ్రేడ్ చేసిన EVM బ్యాలెట్ పేపర్లను రాబోయే అన్ని ఎన్నికల్లో ఉపయోగిస్తారని స్పష్టం చేసింది.

    ఈ మేరకు ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతోపాటు కలర్ ఫొటోలు ముద్రించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

  • 17 Sep 2025 04:54 PM (IST)

    ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్ ముందు వ్యక్తి ఆత్మదహనానికి యత్నం

    మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌ కాన్వాయ్ ముందు ఓ వ్యక్తి ఆత్మదహనానికి ప్రయత్నించాడు. ఈ ఘటన బీడ్ నగర్నాక వద్ద జరిగింది. శేఖర్ థోరాత్ అనే వ్యక్తి తన డిమాండ్లను వ్యక్తం చేస్తూ ఆత్మదహనానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు సమయానికి అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గ్రామపంచాయతీ పనులపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ శేఖర్ థోరాత్ ఈ మేరకు ఆత్మహత్య యత్నం చేసినట్టు సమాచారం.

  • 17 Sep 2025 04:52 PM (IST)

    మావోయిస్టుల మరో సంచలన లేఖ విడుదల

    మావోయిస్టుల మరో సంచలన ప్రకటన. ఆయుధాలు వదిలేస్తామని అమిత్‌షాకు లేఖ. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్‌ పేరిట లేఖ విడుదల. కాల్పులు విరమిస్తామని లేఖలో పేర్కొన్న అభయ్‌.

  • 17 Sep 2025 04:06 PM (IST)

    ఒంగోలులో గంట కుండపోత వాన.. సముద్రం తలపించిన రోడ్లు

    ఒంగోలులో గంటపాటు వర్షం దంచి కొట్టింది. కుండపోత వర్షానికి ఒంగోలు కర్నూల్ రోడ్డు, కొత్త మార్కెట్ సెంటర్, బాపూజీ కాంప్లెక్స్ సెంటర్, గాంధీ రోడ్డులలో వర్షపునీరు నిలిచిపోయింది. వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. కొత్త మార్కెట్లోని కూరగాయల దుకాణాల్లో వర్షం నీరువచ్చి చేరింది. కొద్దిసేపు కురిసిన వర్షానికి నాలాలు పొంగిపొర్లాయి. వీధులు జలమయమయ్యాయి.

  • 17 Sep 2025 03:04 PM (IST)

    SBI బ్యాంకులో భారీ దోపిడీ.. రూ.2 కోట్ల డబ్బు, 15 కేజీల బంగారం మాయం

    కర్ణాటకలోని విజయపుర జిల్లాలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. చడచణ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖలో దోపిడీ జరిగింది. ఐదుగురికిపైగా ముసుగులు ధరించిన దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. బ్యాంక్ మేనేజర్, క్యాషియర్, సిబ్బంది చేతులు, కాళ్లు కట్టి, ఒక గదిలో బంధించారు. సమాచారం అందుకున్న ఎస్పీ లక్ష్మణ నింబార్గి సహా ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రాథమికంగా దాదాపు రూ.2 కోట్లు నగదు, 15 కేజీలకు పైగా బంగారం దోపిడీకి గురైనట్టు అనుమానం.

  • 17 Sep 2025 03:01 PM (IST)

    హైదరాబాద్‌లో పలువురు ఇన్స్పెక్టర్లకు బదిలీలు, పదోన్నతి

    హైదారాబాద్ నగర పోలీస్ కమిషనర్ పరిధిలో పలువురు ఇన్స్పెక్టర్లకు బదిలీ, పదోన్నతిలపై ఉత్తర్వులు జరీ చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషన్ సీవీ ఆనంద్. 50 మంది ఇన్స్పెక్టర్‌లు బదిలీ, పదోన్నతి కల్పించిన కమిషనర్ సీవీ ఆనంద్.

  • 17 Sep 2025 02:58 PM (IST)

    బాలుడిపై గుర్తు తెలియని వ్యక్తులు బ్లేడుతో దాడి

    గుంటూరు జిల్లా తుళ్ళూరులో బాలుడిపై గుర్తు తెలియని వ్యక్తులు బ్లేడుతో దాడి చేశారు. రాత్రి 10:30 గంటల సమయంలో కిరాణా షాపుకు వచ్చిన దాసరి రామ సంతోష్. ATMలో డబ్బులు డ్రా చేయాలని పిలిచిన గుర్తు తెలియని వ్యక్తులు. ATM దగ్గరికి వెళ్లే సమయంలో రామ సంతోష్‌కు ద్విచక్ర వాహనం తాళాలు ఇవ్వాలని బెదిరింపు. వెంట తెచ్చుకున్న బ్లేడుతో రామ సంతోష్ పై దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. అనంతరం పరార్‌. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దాడికి సంబంధించిన దృశ్యాలు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు.

  • 17 Sep 2025 02:55 PM (IST)

    ‘ఛీ.. ఇదేం పని పెద్ద మనిషీ’ వరుసకు కూతురయ్యే యువతికి సొంత బాబాయ్‌ వేదింపులు

    శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కూతురు వరసయ్యే యువతికి బాబాయి లైంగిక వేధింపులు కలకలం సృష్టించింది. వాట్సాప్ లో వీడియో కాల్స్, అర్థనగ్న ఫోటోలు, అసభ్యకర మెసేజ్ లు యువతకు పంపిస్తున్న బాబాయ్. పెనుకొండ మండలం అమ్మవారిపల్లికి చెందిన బాబాయ్ వెంకటరెడ్డి తన అన్న కూతురిని ఫోన్ లో లైంగిక వేదింపులు. అర్థరాత్రి యువతికి న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ అసభ్యకర మెసేజ్ లు పంపిస్తున్న బాబాయ్ వెంకట్ రెడ్డి. లైంగిక వేధింపులు తాళలేక కియా పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కియా పోలీసులు. బాబాయే కదా అని ఫోన్ నెంబర్ ఇచ్చిన పాపానికి ప్రైవేట్ పార్ట్స్ ఫోటో తీసి యువతికి పంపిన బాబాయ్ వెంకటరెడ్డి. పిన్ని ఊరికి వెళ్ళింది అంటూ అసభ్యకర మెసేజ్‌లు. అశ్లీల ఫోటోలు పంపిన బాబాయ్ కోసం పోలీసుల గాలింపు.

  • 17 Sep 2025 02:52 PM (IST)

    కోడెలది ఆత్మహత్యకాదు.. ముమ్మాటికీ హత్యే.. ఎమ్మెల్యే చింతమనేని ఘాటు వ్యాఖ్యలు

    పల్నాడు జిల్లా నర్సరావుపేటలో స్వర్గీయ కోడెల శివప్రసాదరావు 6వ వర్ధంతి సందర్భంగా… రావిపాడులో కోడెల శివప్రసాదరావు విగ్రహ ఆవిష్కరణ జరిగింది. విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, AP TS చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ…

    కోడెల బ్రతికుంటే మంచి పదవిలో ఉండేవాడు. కోడెల అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే కోడెల. కొంతమంది దుర్మార్గుల కుట్రల వల్ల కోడెల ఆత్మహత్య చేసుకున్నాడు. కోడెల మరణానికి కారుకులైన వాళ్లకి రాజకీయంగా పునర్జన్మ లేకుండా చేసిన పల్నాడు ప్రజలను నేను అభినందిస్తున్నాను. కోడెల మరణానికి కారకులైన వాళ్లని కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వం వచ్చి 15 నెలలు కావస్తున్న కోడెల మరణానికి కారకులైన వాళ్ల మీద ఎందుకు ఫిర్యాదు చేయలేదు నాకు చాలా బాధగా ఉంది. కోడెలది హత్యగానే భావించాలి.

  • 17 Sep 2025 02:49 PM (IST)

    డిజిటల్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ప్రారంభించిన సినీనటి మంచు లక్ష్మి

    పల్నాడు జిల్లా ధరణికోటలో డిజిటల్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ప్రారంభించిన ‘టీచ్ ఫర్ చేంజ్’ అధినేత సినీ నటి మంచు లక్ష్మి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నటి మంచు లక్ష్మి మాట్లాడుతూ.. టీచ్ ఫర్ చేంజ్ లో భాగంగా అమరావతి మండలంలో 10 స్కూల్స్ లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. పల్నాడు జిల్లాలో 605 మంది విద్యార్థులకు చేయూత అందిస్తున్నాం. టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ద్వారా పలు రాష్ట్రాల్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ ప్రారంభించాం . ఇంగ్లీష్ భాష నేర్చుకుంటే విద్యార్థులు ఏదేశంలో అయినా రాణించవచ్చు. యాభై సంవత్సరాలుగా సినీ రంగంలో మా కుటుంబానికి మీరు తోడుగా వున్నారు. ఆశీస్సులు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

  • 17 Sep 2025 02:46 PM (IST)

    ఇంకా కొలిక్కిరాని తురకపాలెం మిస్టరీ మరణాల గుట్టు.. తాజా అప్‌డేట్ ఇదే

    గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా.. తురకపాలెం గ్రామంలో ఉన్న మెడికల్ క్యాంపు, వాటర్ ట్యాంక్, క్వారీలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న 1050 మందికి రక్త పరీక్షలు చేసాం. 110 మందికి బ్లడ్ కల్చర్ చేసాం. మున్సిపల్ ట్యాంక్ నుంచి సురక్షిత నీరు అడిగారు. 3 నెలల వరుకు గ్రామంలో మెడికల్ క్యాంపు కొనసాగుతుంది. గ్రామంలో ఉన్న ప్రజలకు వైద్యులు ఎప్పుడు అందుబాటులో ఉంటారని అన్నారు.

  • 17 Sep 2025 02:40 PM (IST)

    నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు.. ఉరుములు మెరుపులతో బీభత్సం

    బుధవారం (సెప్టెంబర్‌ 17) రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. వరుసగా మూడు రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో గంటకు 30 నుంచి 40 కి మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

  • 17 Sep 2025 02:37 PM (IST)

    బంగాళాఖాతంలో ద్రోణి.. వచ్చే మూడు రోజులు వానలే వానలు!

    నిన్న నైరుతి విదర్భ ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల చక్రవాత ఆవర్తనం ఈరోజు మరాత్వాడ ప్రాంతంలో కొనసాగుతూ సగటు సముద్రమట్టంకు 3.1 నుంచి 5.8 కి మీ ఎత్తువరకు ఉంది. మరోవైపు ద్రోణి మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతం నుంచి తూర్పు విదర్భ, తెలంగాణ, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌ల మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి అనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టం నుంచి 0.9 కి మీ ఎత్తులో బుధవారం ఏర్పడింది. నిన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ఈరోజు బలహీన పడింది. దీని ప్రభావంతో రాగల 3 రోజులు తెలంగాణ రాష్ట్రంలోవర్షాలు పడనున్నాయి.

  • 17 Sep 2025 02:00 PM (IST)

    ట్రంప్‌ విషెస్

    ప్రధాని మోదీకి ఫోన్‌ చేసి మరి విషెస్‌ చెప్పారు ట్రంప్‌. ఇదే విషయాన్ని ఎక్స్‌ వేదికగా పోస్టు చేయగా.. మోదీ స్పందిస్తూ భారత్‌-అమెరికా సమగ్ర భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నామన్నారు

  • 17 Sep 2025 01:45 PM (IST)

    రాహుల్‌, ఖర్గే విషెస్

    ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రాహుల్‌, ఖర్గే. ఎల్లప్పుడు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

  • 17 Sep 2025 01:30 PM (IST)

    డిప్యూటీ సీఎం పవన్‌ విషెస్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కూడా ప్రధానికి బర్త్‌ డే విషెస్‌ తెలియజేశారు. ప్రజల పట్ల మీ ప్రేమ, సమర్థ నాయకత్వం, సామాజిక బాధ్యత.. ఎంతో ప్రేరణ ఇస్తుందన్నారు.

  • 17 Sep 2025 01:15 PM (IST)

    మోదీకి బర్త్‌ డే విషెస్‌

    ప్రజల కోసం నిరంతరం కృషిచేసే ప్రధాని.. దేశానికి దొరకడం అదృష్టమన్నారు సీఎం చంద్రబాబు. సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌తో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నా మోదీకి బర్త్‌ డే విషెస్‌ చెప్పారు

  • 17 Sep 2025 01:00 PM (IST)

    సంకల్ప్ వాక్‌ అండ్ బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌

    ప్రధాని బర్త్‌ డే సందర్భంగా సంకల్ప్ వాక్‌ అండ్ బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌లో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా బడ్ల్ డొనేట్ చేశారు. ప్రధాని మోదీ.. నిండునూరేళ్లూ సంపూర్ణ ఆరోగ్యం, ఆనందంతో ఉండాలన్నారు

  • 17 Sep 2025 12:45 PM (IST)

    వేస్ట్ మెటీరియల్స్‌ అద్భుతమైన ప్రధాని మోదీ చిత్రం

    వేస్ట్ మెటీరియల్స్‌ అద్భుతమైన ప్రధాని మోదీ చిత్రం గీసి విషెస్‌ చెప్పింది యూపీలోని అలీఘర్‌ చెందిన లక్ష్మీ.. ప్రజల కోసం నిరంతరం కృషిచేసే ప్రధానికి స్పెషల్‌ విషెస్‌ చేశారు.

  • 17 Sep 2025 12:30 PM (IST)

    ప్రధానికి స్పెషల్‌ విష్‌

    గుజరాత్‌లోని రాజకోట్‌లో పలువురు కళాకారులు రంగలితో మోదీకి విషెస్‌ చెప్పారు. ప్రధానికి స్పెషల్‌గా విష్‌ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేక కాన్సెప్ట్‌ను తీసుకువచ్చారు..

  • 17 Sep 2025 12:15 PM (IST)

    ప్రధానికి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు

    అటు పూరీకి చెందిన ఓ శాండ్‌ ఆర్టిస్ట్ ప్రధానికి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతా అద్భుత సైకత శిల్పం గీశాడు.. మోదీ శాండ్‌ ఆర్ట్ ఆయన అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది..

  • 17 Sep 2025 12:00 PM (IST)

    ప్రధాని మోదీకి వెల్లువెత్తిన శుభాకాంక్షలు

    ప్రధాని మోదీకి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వారణాసిలో ప్రధాని పుట్టినరోజు సందర్భంగా అభిమానులు గంగనదికి హారతి ఇచ్చి పూజలు చేశారు.

  • 17 Sep 2025 11:45 AM (IST)

    BRS, కాంగ్రెస్‌ పార్టీలపై కిషన్‌ రెడ్డి విమర్శలు

    — BRS, కాంగ్రెస్‌ పార్టీలపై కిషన్‌ రెడ్డి విమర్శలు

    — MIM పార్టీకి భయపడి వాస్తవాలను తొక్కిపెడుతున్నారు- కిషన్‌ రెడ్డి

    — ఓట్ల కోసం, MIM పార్టీకి భయపడి చరిత్రను వక్రీకరించి అనేక పేర్లు పెడుతున్నారు

    — తెలంగాణ ప్రజలు తప్పకుండా వారికి బుద్ధి చెప్తారు

    — మూడేళ్ల తర్వాత ప్రతి గ్రామంలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తాం- కిషన్‌ రెడ్డి

  • 17 Sep 2025 11:30 AM (IST)

    తెలంగాణ భవన్‌లో జాతీయ సమైక్యతా దినోత్సవం

    — తెలంగాణ భవన్‌లో జాతీయ సమైక్యతా దినోత్సవం

    — జాతీయ జెండాను ఆవిష్కరించిన కేటీఆర్‌

    — తెలంగాణలో మరోసారి సంక్షేమ, అభివృద్ధి రాజ్యం రావాలి

    — నియంతృత్వం లేని ప్రజాస్వామిక రాజ్యం రావాలని..

    కేసీఆర్‌ ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఉంటాం-కేటీఆర్

  • 17 Sep 2025 11:18 AM (IST)

    రాష్ట్ర పాలకుల కుట్రలపై తెలంగాణ సమాజం ఆలోచించాలి- బండి సంజయ్‌

    రాష్ట్ర పాలకుల కుట్రలపై తెలంగాణ సమాజం ఆలోచించాలన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్‌. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడంలో మీకు ఉన్న ఇబ్బందేంటి అని ప్రశ్నించారు. ఓ వర్గం ఓట్ల కోసం ఇవాళ విమోచన దినోత్సవాన్ని వివాదాస్పదం చేశారన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తోందని.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే గల్లీ గల్లీలో విమోచన వేడుకలు నిర్వహిస్తామన్నారు బండి సంజయ్‌.

  • 17 Sep 2025 10:15 AM (IST)

    ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ పర్యటన

    ఇవాళ ప్రధాని మోదీ తన పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో పర్యటిస్తారు. ఇక్కడ దేశంలోని మొట్టమొదటి PM మిత్రా పార్క్‌కు శంకుస్థాపన చేసి, ‘సేవా పఖ్వాడా’ను ప్రారంభిస్తారు. ‌

  • 17 Sep 2025 10:00 AM (IST)

    ప్రధాని మోదీకి శుభాకాంక్షలు

    ఇవాళ మన ప్రధాని మోదీ 75వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఆయనకు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వారణాసిలో ప్రధాని పుట్టినరోజు సందర్భంగా అభిమానులు గంగనదికి హారతి ఇచ్చారు.. ఆయన మరింత ఆయుష్షు, ఆరోగ్యంతో ఉండాలని పూజలు చేశారు. అటు పూరీకి చెందిన ఓ శాండ్‌ ఆర్టిస్ట్ ప్రధానికి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతా అద్భుత సైకత శిల్పం గీశాడు.. మోదీ శాండ్‌ ఆర్ట్ ఆయన అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.

  • 17 Sep 2025 09:45 AM (IST)

    ప్రధాని నరేంద్రమోదీకి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

    — ప్రధాని నరేంద్రమోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం చంద్రబాబు

    — ప్రజల కోసం నిరంతరం కృషిచేసే ప్రధాని.. దేశానికి దొరకడం అదృష్టం అన్నారు

    — సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌తో దేశాన్ని మోదీ ముందుకు నడిపిస్తున్నారన్నారు

    — వికసిత్ భారత్‌ 2047 లక్ష్యం కోసం మోదీ అందిస్తున్న మార్గదర్శకత్వం అద్భుతమన్నారు చంద్రబాబు

    — ప్రధాని మోదీ.. నిండునూరేళ్లూ సంపూర్ణ ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు

  • 17 Sep 2025 09:30 AM (IST)

    ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు

    — ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కూడా ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు

    — ప్రజల పట్ల మీ ప్రేమ, సమర్థ నాయకత్వం, సామాజిక బాధ్యత.. ఎంతో ప్రేరణ ఇస్తుందన్నారు

    — దేశానికి మరిన్ని సేవలు అందించేందుకు మరింత ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు పవన్‌

  • 17 Sep 2025 09:15 AM (IST)

    విమోచన దినోత్సవంలో పాల్గొన్న రాజ్‌నాథ్‌ సింగ్‌

    — సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్స్‌లో అమరవీరులకు నివాళి అర్పించారు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, గజేంద్ర సింగ్ షెకావత్

    –కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు

    — జాతీయ జెండా ఆవిష్కరించి, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు నేతలు

    — కేంద్ర బలగాల సెల్యూట్ స్వీకరించనున్నారు రాజ్‌నాథ్ సింగ్

    — తర్వాత సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఉంటాయి

    — ఈ కార్యక్రమం అనంతరం కంటోన్మెంట్ పార్క్‌లో వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు రాజ్‌నాథ్ సింగ్

  • 17 Sep 2025 09:00 AM (IST)

    రేపట్నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

    రేపట్నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు. 60రోజులు అసెంబ్లీకి రాకపోతే రాజ్యాంగం ప్రకారం చర్యలు తప్పవన్నారు. కనీసం పులివెందుల ప్రజల కోసమైనా జగన్‌ అసెంబ్లీకి రావాలన్నారు డిప్యూటీ స్పీకర్‌.

  • 17 Sep 2025 08:45 AM (IST)

    తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్‌

    తెలంగాణలో అర్థరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఆరోగ్యశ్రీ సీఈవోతో చర్చలు జరిగినా సమస్య పరిష్కారం కాలేదు. రూ.1,400 కోట్ల బకాయిలు చెల్లించాలని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు డిమాండ్‌ చేస్తున్నాయి.

  • 17 Sep 2025 08:30 AM (IST)

    ప్రజాపాలన దినోత్సవం వేడుకలు

    ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తోంది. అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న మహాత్మ గాంధీ విగ్రహానికి నివాళి అర్పించిన స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు స్పీకర్ గడ్డం ప్రసాద్

  • 17 Sep 2025 08:15 AM (IST)

    మావోయిస్టుల సంచలన ప్రకటన

    మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని నిర్ణయించింది. దేశంలోని పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని తెలిపింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ పార్టీ అధికార ప్రతినిధి అభయ్‌ పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది.

  • 17 Sep 2025 08:15 AM (IST)

    ప్రధానికి వెల్లువెత్తిన శుభాకాంక్షలు

    ఇవాళ మన ప్రధానమంత్రి మోదీ 75వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఆయనకు దేశవ్యాప్తంగా ప్రజల శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వారణాసి ప్రధాని ఆయురారోగ్యాలు ఉండాలంటూ గంగనదికి హారతి ఇచ్చారు. అటు పూరీకి చెందిన ఓ శాండ్‌ ఆర్టిస్ట్ ప్రధానికి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతా అద్భుత సైకత శిల్పం గీశాడు.

  • 17 Sep 2025 08:00 AM (IST)

    నేడు మోదీ 75వ పుట్టినరోజు

    — నేడు మోదీ 75వ పుట్టినరోజు

    — ప్రధానికి ఫోన్‌ చేసి విషెస్‌ చెప్పిన అమెరికా అధ్యక్షుడు

    — మై ఫ్రెండ్‌ అంటూ సంబోధించిన ట్రంప్‌

    — మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబు

    — ట్రంప్‌ విషెస్‌కు మోదీ థ్యాంక్స్‌

    — రెండు దేశాల భాగస్వామ్యం మరింత పెరగాలన్న మోదీ

    — ఉక్రెయిన్‌ యుద్ధ పరిష్కారానికి ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతిస్తామన్న ప్రధాని

  • 17 Sep 2025 07:45 AM (IST)

    వలసదారులకు నో ఎంట్రీ.. పశ్చిమదేశాల్లో నిరసనలు

    అభివృద్ధి చెందిన దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వలసలు. ఆయా దేశాల్లో జీవన ప్రమాణాలు అత్యున్నతంగా ఉండటం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటంతో ఇతర దేశాల నుంచి వలసలు బాగా పెరిగిపోయాయి. గతంలో వారికి సాదర స్వాగతం లభించేది, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చాలా దేశాలలో “స్థానికులకే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దక్కాలి” అనే నినాదంతో నిరసనలు, ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ఉన్నత విద్య, ఉజ్వల భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయుల ఆశలు ఆవిరవుతున్నాయి.

  • 17 Sep 2025 07:30 AM (IST)

    ఇంధనశాఖపై తెలంగాణ సీఎం రేవంత్ సమీక్ష

    ఇంధనశాఖపై తెలంగాణ సీఎం రేవంత్ సమీక్ష. కొత్త డిస్కం ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికను సీఎం రేవంత్‌కు వివరించిన అధికారులు. ప్రస్తుతం ఉన్న రెండు డిస్కంలను మూడు డిస్కంలుగా పునర్విభజన చేయాలని సీఎం సూచించారు. కేబినెట్ ఆమోదం తర్వాత కొత్త డిస్కం ఏర్పాటు చేస్తామన్నారు. పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు సీఎం ఆదేశించారు.

  • 17 Sep 2025 07:15 AM (IST)

    సమైక్యత దినోత్సవంగా బీఆర్‌ఎస్‌

    మరోవైపు సెప్టెంబర్ 17న ప్రతి సంవత్సరం సమైక్యత దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తోంది బీఆర్‌ఎస్‌. ఇటు ఎంఐఎం కూడా బీఆర్‌ఎస్‌ బాటలోనే సెప్టెంబర్ 17న ప్రతి ఏడాది సమైక్యతా దినాలు నిర్వహిస్తోం వస్తుంది.

  • 17 Sep 2025 07:00 AM (IST)

    గాంధీభవన్‌లో విలీనదినం వేడుకలు

    కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటిలాగా గాంధీభవన్‌లో విలీనదినం వేడుకలు జరపనుంది. జిల్లా కేంద్రాల్లో కూడా విలీనదినం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విలీన దినోత్సవంపై ప్రజలను బీజేపీ కన్ఫ్యూజ్‌ చేస్తోందని పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌గౌడ్‌ మండిపడ్డారు.

  • 17 Sep 2025 06:45 AM (IST)

    సెప్టెంబర్ 17 రాజకీయం

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఎంఐఎం పార్టీ చెప్పినట్టు వింటున్నాయని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. గత పదేళ్లు మజ్లిస్‌కు భయపడి సెప్టెంబర్ 17ను బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా విమోచన దినోత్సవం జరపలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసదుద్దీన్‌కు జడిసి సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపడం లేదన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రాంచందర్ రావు.

Published On - Sep 17,2025 6:42 AM