Weather Alert: అబ్బ.. చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్
Andhra Pradesh and Telangana Weather Report: తెలుగు రాష్ట్రాల్లో్ ఎండలు మండిపోతున్నాయి.. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఈ క్రమంలోనే.. వాతావరణ శాఖ ఆంద్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.

తెలుగు రాష్ట్రాల్లో్ ఎండలు మండిపోతున్నాయి.. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఈ క్రమంలోనే.. వాతావరణ శాఖ ఆంద్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. తూర్పు ఉత్తరప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలు పై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ, రాయలసీమ – తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉత్తర-దక్షిణ ద్రోణి విస్తరించి ఉంది. దీంతో పాటు.. మరాఠ్వాడ నుండి అంతర కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు, సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్న నిన్నటి ఉత్తర-దక్షిణ ద్రోణి ఈ రోజు బలహీనపడినది .
వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం :-
శనివారం, ఆదివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు – బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
శనివారం, ఆదివారం, సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
రాయలసీమ :-
శనివారం, ఆదివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
గమనిక :- రాయలసీమలో రాగల 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-4డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశముంది.. ఆ తదుపరి గణనీయమైన మార్పు లేదు.
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు:
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తూర్పు ఉత్తరప్రదేశ్, పరిసర ప్రాంతాలపై ఉన్న చక్రవాత పరిభ్రమణం నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు, తూర్పు మధ్య ప్రదేశ్, విదర్భ, తెలంగాణ, రాయలసీమ – తమిళనాడు మీదుగా 0.9 కి.మీ ఎత్తులో ఉత్తర-దక్షిణ దిశలో ఒక ట్రఫ్ కొనసాగుతోంది. అదే సమయంలో మరాఠ్వాడా నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు, అంతర్గత కర్ణాటక, రాయలసీమ – తమిళనాడు మీదుగా 0.9 కి.మీ ఎత్తులో ఉన్న ఉత్తర-దక్షిణ ట్రఫ్ బలహీనపడింది. అంతర్గత మహారాష్ట్ర – సమీప తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్ణాటక ప్రాంతాలపై 3.1 నుండి 5.8 కి.మీ ఎత్తు మధ్య ఉన్న యాంటీసైక్లోనిక్ పరిభ్రమణం కొనసాగుతోంది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):
తెలంగాణ రాష్ట్రంలో శనివారం, ఆదివారం, సోమవారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రానున్న రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్ద మార్పు ఏమి లేదు .
వాతావరణ హెచ్చరికలు : ఈరోజు, రేపు – ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, గంటకు 30- 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
