Agnipath Protest: కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. యువకులు రణరంగం సృష్టించిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయి. విధ్వంసానికి పాల్పడిన యువకులను పోలీసులు అదులో తీసుకున్నారు. ఈ ఘటనలో రైల్వే శాఖకు భారీ ఎత్తున నష్టం వాటిల్లింది. ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సుబ్బారావును పోలీసులు విచారిస్తున్నారు.
ఈ అల్లర్ల కేసులో అరెస్టు అయిన వారి తల్లిదండ్రులు చంచల్‌గూడ జైలు దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఎలాంటి సంబంధం లేకపోయినా తమ పిల్లలను అరెస్ట్ చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్లలో వేలాది మంది ఆందోళనకారులు పాల్గొన్నారు. వారిని అరెస్ట్ చేసి.. నగరంలోని అనేక స్టేషన్లకు తరలించారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన తర్వాత.. వాళ్లను చంచల్‌గూడ జైలుకు తరలించారు. దీంతో వారి తల్లిదండ్రులు చంచల్‌గూడ జైలు దగ్గరకు వస్తున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి