Hyderabad: గర్భవతిని చేసి మొహం చాటేసిన ప్రియుడు.. హుస్సేన్ సాగర్‌లో దూకిన ప్రియురాలు
ప్రియుడు మోసం చేశాడన్న కారణంతో హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది ఓ యువతి. లేక్ పోలీసులు చూసి సకాలంలో స్పందించడంతో యువతి ప్రాణాలతో బయటపడింది. వివరాల్లోకి వెళితే..
ప్రియుడు మోసం చేశాడన్న కారణంతో హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది ఓ యువతి. లేక్ పోలీసులు చూసి సకాలంలో స్పందించడంతో యువతి ప్రాణాలతో బయటపడింది. వివరాల్లోకి వెళితే.. మెదక్‌కు చెందిన నందినికి కూకట్‌పల్లికి చెందిన రాజశేఖర్ అనే ఎలక్ట్రీషియన్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అంతటితో ఆగని వీరి పరిచయం శారీరక బంధానికి దారి తీసింది. దీంతో నందిని గర్భవతి అయ్యింది.
నందినిని పెళ్లి చేసుకుంటానని దొంగ హమీ ఇచ్చి రాజశేఖర్ ఆమెను 8 నెలల గర్భవతిని చేసి ముఖం చాటేశాడు. పెళ్లి గురించి ఎన్ని సార్లు అడిగినా స్పందించకపోవడం నందిని కొన్ని రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అనంతరం రాజశేఖర్ స్టేషన్ బెయిల్‌పై బయటకొచ్చాడు.
దీంతో తనకు న్యాయం జరగలేదని యువతి తీవ్ర మనస్థాపానికి గురైంది. దీంతో ఆదివారం ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకున్న యువతి ట్యాంక్ బండ్‌లో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే అదే సమయంలో అక్కడే ఉన్న లేక్ పోలీసులు దీనిని గమనించారు. వెంటనే యువతిని కాపాడి, బయటకు తీసుకొచ్చారు. అనంతరం మహిళను కాపాడి కౌన్సిలింగ్ ఇచ్చారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..