Amit Shah Telangana Visit Updates: వచ్చే ఎన్నికల్లో ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమే.. చేవేళ్ల సంకల్ప సభలో అమిత్ షా..

Shaik Madar Saheb

|

Updated on: Apr 24, 2023 | 11:55 AM

Amit Shah Speech in Chevella Updates: కర్ణాటక ఎన్నికల తర్వాత అమిత్‌షా ఫోకస్ మొత్తం తెలంగాణపైనే నిలపనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీని మరింత పటిష్ఠంగా మార్చేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. కాగా అమిత్ షా తెలంగాణ టూర్‌లో

Amit Shah Telangana Visit Updates: వచ్చే ఎన్నికల్లో ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమే.. చేవేళ్ల సంకల్ప సభలో అమిత్ షా..
Amit Shah Telangana Visit

బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌ షా హైదరాబాద్ చేరుకున్నారు. చేవేళ్ల పార్లమెంట్‌ పరిధిలో జరిగే భారీ బహిరంగ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి పాల్గొననున్నారు. కాగా అమిత్‌షా సభను భారీ సక్సెస్‌ చేసేందుకు బీజేపీ శ్రేణులు సభాస్థలికి చేరుకున్నారు. బహిరంగ సభకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. కర్ణాటక ఎన్నికల తర్వాత అమిత్‌షా ఫోకస్ మొత్తం తెలంగాణపైనే నిలపనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీని మరింత పటిష్ఠంగా మార్చేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. కాగా అమిత్ షా తెలంగాణ టూర్‌లో ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు బీజేపీలో చేరే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

అలాగే రాబోయే ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశముందని చెబుతున్నారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని అమిత్‌షా నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి చేవెళ్లకు అమిత్ షా వెళతారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ మేరకు పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు.

లైవ్ కోసం ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Apr 2023 09:22 PM (IST)

    చేవెళ్ల సభపై అమిత్ షా ఆసక్తికర ట్వీట్..

    తెలంగాణలో ప్రధాని మోడీకి భారీ ఎత్తున మద్దతు లభించిందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.  

  • 23 Apr 2023 09:15 PM (IST)

    అమిత్‌షా ట్వీట్

    మాట్లాడింది పట్టుమని అరగంట కూడా లేదు, కానీ కేసీఆర్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణలో హాట్‌ ఇష్యూస్‌ అయిన TSPSC, టెన్త్‌ పేపర్ల లీక్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. మీ స్వార్థం కోసం యువత జీవితాలతో ఆటలాడుకుంటారా అంటూ కేసీఆర్‌ను నిలదీశారు అమిత్‌షా. రాబోయే బీజేపీ సర్కారే, డౌటే లేదంటూ బల్లగుద్దినట్టు ధీమాగా చెప్పారు అమిత్‌షా. BRS ప్రభుత్వం అవినీతికూపంలో కూరుకుపోయిందన్న షా.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ గద్దె దిగడం ఖాయం… బీజేపీ పవర్‌లోకి రావడం పక్కా అన్నారు. ఏం చెప్పాలనుకున్నారో? ఎవరిని విమర్శించాలనుకున్నారో? ఏ పాయింట్స్‌ రెయిజ్‌ చేయాలనున్నారో? అమిత్‌షా స్ట్రెయిట్‌గా చెప్పారు.

  • 23 Apr 2023 07:33 PM (IST)

    తెలంగాణలో అధికారంలోకి రాగానే.. – బండి సంజయ్

    తెలంగాణలో అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ఇచ్చారు. చేవెళ్లలో బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహిస్తోంది. ఈ సభకు కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి సహా రాష్ట్ర బీజేపీ నేతలు హాజరయ్యారు. తెలంగాణను అభివృద్ధి చేయడానికే అమిత్ షా రాష్ట్రానికి వచ్చారని చెప్పారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. తనను ఇటీవల అరెస్టు చేసి పోలీసులు 8 గంటల పాటు రోడ్లపై తిప్పారని బండి సంజయ్ చెప్పారు.

  • 23 Apr 2023 07:27 PM (IST)

    ప్రధాని కుర్చి ఖాళీగా లేదు- అమిత్ షా

    చేవెళ్ల విజయ సంకల్ప సభలో అమిత్‌షా మాట్లాడిన ప్రతి మాటా ఒక్కో తూటాలా పేలింది. కేసీఆర్‌ అండ్‌ పరివార్‌ టార్గెట్‌గా ప్రశ్నల వర్షం కురిపించారు. పేపర్ లీకేజీపై కేసీఆర్ పెదవి విప్పలేదు. టీఎస్‌పీఎస్‌సీ పరీక్షల పేపర్లు లీకైయ్యాయి. ప్రధాని కుర్చి ఖాళీగా లేదంటూ మండిపడ్డారు. మళ్లీ మోదీయే ప్రధాని బాధ్యతలు చేపడతారన్నారు. కాషాయ శ్రేణులకు విజయోపదేశం చేస్తూనే కేసీఆర్‌ సర్కార్‌పై పంచ్‌ డైలాగులు పేల్చారు అమిత్‌షా. BRS ప్రభుత్వం అవినీతికూపంలో కూరుకుపోయిందన్న షా.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ గద్దె దిగడం ఖాయమన్నారు.

    తెలంగాణలో బీజేపీ పవర్‌లోకి రావడం పక్కా అంటూ స్పష్టంచేశారు.  ఓవైసీపైనా నిప్పులు చెరిగారు షా. అసలు కేసీఆర్‌ స్టీరింగే… ఓవైసీ చేతిలో ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని హామీ ఇచ్చారు. ఇక, TSPSC, టెన్త్‌ పేపర్ల లీక్‌పైనా ప్రశ్నల వర్షం కురిపించారు అమిషా. నిరుద్యోగ యువత జీవితాలతో ఆటలాడుకుంటారా అంటూ కేసీఆర్‌ సర్కార్‌పై చెలరేగిపోయారు షా.

  • 23 Apr 2023 07:24 PM (IST)

    తెలంగాణ యువతకు అన్యాయం జరుగుతోంది – అమిత్ షా

    రాష్ట్రంలో యువతకు అన్యాయం జరుగుతోందంటూ అమిత్ షా ఫైర్ అయ్యారు. ఎస్ఎస్‌పీ పేపర్లు సహా.. అన్ని పేపర్లు లీక్ అవుతున్నాయని విమర్శించారు. దీంతో 55 వేల యువత భవిష్యత్ నాశనమైందన్నారు. ఎన్నికల్లో ఈ యువత అంతా కేసీఆర్‌ను తిరస్కరిస్తందన్నారు. హడావుడిగా నియామక ప్రక్రియ చేపట్టారంటూ విమర్శించారు.

    మాట్లాడింది పట్టుమని అరగంట కూడా లేదు, కానీ కేసీఆర్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణలో హాట్‌ ఇష్యూస్‌ అయిన TSPSC, టెన్త్‌ పేపర్ల లీక్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. మీ స్వార్థం కోసం యువత జీవితాలతో ఆటలాడుకుంటారా అంటూ కేసీఆర్‌ను నిలదీశారు అమిత్‌షా.

    తెలంగాణలో రాబోయేది బీజేపీ సర్కారే.. ఇందులో డౌటే లేదంటూ బల్లగుద్దినట్టు అమిత్ షా ధీమాగా పేర్కొన్నారు. BRS ప్రభుత్వం అవినీతికూపంలో కూరుకుపోయిందన్న షా.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ గద్దె దిగడం ఖాయం.. బీజేపీ పవర్‌లోకి రావడం పక్కా అన్నారు.

    పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా బండి సంజయ్ మాట్లాడుతున్నారని.. బండి సంజయ్ అరెస్టును మీరు సమర్థిస్తారా అంటూ ప్రశ్నించారు. బండి సంజయ్‌ను అరెస్టు చేసి 24 గంటలు కూడా జైల్లోనే కోర్టు బెయిల్ ఇచ్చిందన్నారు.

  • 23 Apr 2023 07:21 PM (IST)

    వచ్చే ఎన్నికల్లో ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమే – అమిత్ షా

    కేసీఆర్ ఏం చేసినా బీజేపీని అడ్డుకోలేరన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఈ సందర్భంగా తెలంగాణ కమల దళానికి విజయోపదేశం చేశారు. గెలవాలి, గెలిచి తీరాలి అంటూ విజయ సంకల్పాన్ని నూరిపోశారు.

  • 23 Apr 2023 07:20 PM (IST)

    తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా ప్రత్యేక భేటీ..

    షెడ్యూల్‌లో లేని మీటింగ్‌ లో కూడా అమిత్ షా పాల్గొని.. బీజేపీ కీలక నేతలకు పలు సూచనలు చేశారు. సభకు ముందు నోవాటెల్‌లో 45నిమిషాలపాటు ముఖ్యనేతలతో సమావేశమయ్యారు అమిత్‌షా. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా షా.. ప్రధాన చర్చ నిర్వహించారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఎలాగుంది?. ఎక్కడెక్కడ లోపాలున్నాయ్‌?. అధికారంలోకి రావాలంటే ఇంకా ఏమేం చేయాలి? అంటూ ఆరా తీశారు.

    మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని, కేసీఆర్‌ సర్కార్‌ వైఫల్యాలను ఎండగట్టాలంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు అమిత్‌షా. అనంతరం చేవెళ్ల KVR గ్రౌండ్‌లో బీజేపీ విజయ సంకల్ప సభకు చేరుకుని కీలక ప్రసంగం చేశారు.

  • 23 Apr 2023 07:15 PM (IST)

    కేసీఆర్‌ను గద్దె దింపేంత వరకు మా పోరాటం- అమిత్ షా

    బండి సంజయ్‌ను కేసీఆర్ సర్కారు జైల్లో వేసింది. కేసీఆర్‌ను గద్దె దింపేంత వరకు మా పోరాటం కొనసాగుతుందన్నారు. బండి సంజయ్ అరెస్టును మీరు సమర్థిస్తారా ..? అంటూ అమిత్ షా ప్రశ్నించారు.

  • 23 Apr 2023 07:14 PM (IST)

    బీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన అమిత్ షా

    బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అమిత్ షా టార్గెట్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని విమర్శించారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రజాగ్రహాన్ని దేశమంతా చూస్తోందన్నారు.

  • 23 Apr 2023 07:12 PM (IST)

    బసవన్నకు పాదభివందనం చేసి ప్రసంగం..

    బసవన్నకు పాదభివందనం చేసి ప్రసంగం ప్రారంభించారు. చిల్కూరు బాలాజీ, యాదాద్రి నరసింహుడిని స్మరించుకున్నారు అమిత్ షా.

  • 23 Apr 2023 07:09 PM (IST)

    భారత్ మాతకీ జై అంటూ ప్రసంగం..

    భారత్ మాతకీ జై అంటూ ప్రసంగం ప్రారంభించారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఢిల్లీలోని ప్రధానికి వినపడేలా గట్టిగా నినదించాలని అభ్యర్థించారు. అమిత్ షా అభ్యర్థనకు బీజేపీ శ్రేణుల నుంచి భారీ స్పందన వచ్చింది.

  • 23 Apr 2023 06:55 PM (IST)

    45 నిమిషాలుగా కొనసాగుతున్న..

    తెలంగాణ బీజేపీ నేతలతో కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశం కొనసాగుతోంది. నోవోటెల్‌‌లో గత 45 నిమిషాలుగా సమావేశం కొనసాగుతోంది. ఇప్పటికే ముగియాల్సిన సమావేశం మరింత సేపు కొనసాగే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి అమిత్‌ షా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా చేవెళ్లకు బయలుదేరని షెడ్యూల్‌లో  ఉంది. ఎయిర్‌పోర్టు నుంచి శంషాబాద్‌ నోవోటెల్‌కి వెళ్లారు అమిత్‌ షా. అక్కడే తెలంగాణ బీజేపీ నాయకులతో సమావేశం అయ్యారు.

  • 23 Apr 2023 05:32 PM (IST)

    షెడ్యూల్‌లో లేని మీటింగ్‌..

    కేంద్ర మంత్రి అమిత్‌ షా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా చేవెళ్లకు బయలుదేరని షెడ్యూల్‌లో  ఉంది. అయితే, అమిత్ షా షెడ్యూల్ మారింది. ఎయిర్‌పోర్టు నుంచి శంషాబాద్‌ నోవోటెల్‌కి వెళ్లారు అమిత్‌ షా. తెలంగాణ బీజేపీ నాయకులతో సమావేశం అయ్యారు.

  • 23 Apr 2023 05:26 PM (IST)

    పార్టీని మరింత పటిష్ఠంగా మార్చేందుకు వ్యూహాలు..

    తెలంగాణలో పార్టీని మరింత పటిష్ఠంగా మార్చేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. కాగా అమిత్ షా తెలంగాణ టూర్‌లో ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు బీజేపీలో చేరే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

  • 23 Apr 2023 05:25 PM (IST)

    ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన నేరుగా..

    ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన నేరుగా చేవెళ్ల వెళ్లనున్నారు అమిత్‌ షా. చేవెళ్ల KVR గ్రౌండ్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ ఏర్పాటు చేశారు. తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ.. చేవెళ్ల సభకు భారీగా జనసమీకరణ చేశారు.  దాదాపు గంట పాటు చేవెళ్ల సభలో అమిత్‌ షా మాట్లాడనున్నారు.

  • 23 Apr 2023 05:21 PM (IST)

    ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికిన..

    శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. ఆయనకు ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌, బండి సంజయ్‌ వీరితోపాటు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నా ఈటల, విజయశాంతి, రఘునందన్‌రావు, బూర నర్సయ్య గౌడ్‌.

Published On - Apr 23,2023 5:20 PM

Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!