భర్త వేధింపులు తాళలేక కేంద్ర ప్రభుత్వానికే లేఖ రాసిన సౌదీ మహిళ.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో..!

భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్నే ఆశ్రయించిన సంఘటన ఇది. భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక చిరవరికి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న ఆ మహిళ కన్నీటి గాథ వింటే మనం కూడా అయ్యో పాపం అనకుండా ఉండలేం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భర్త వేధింపులు తాళలేక కేంద్ర ప్రభుత్వానికే లేఖ రాసిన సౌదీ మహిళ.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో..!
Saudi Woman
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Balaraju Goud

Updated on: Jul 04, 2024 | 8:22 PM

భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్నే ఆశ్రయించిన సంఘటన ఇది. భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక చిరవరికి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న ఆ మహిళ కన్నీటి గాథ వింటే మనం కూడా అయ్యో పాపం అనకుండా ఉండలేం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సౌదీ అరేబియాలో ఉంటున్న షేక్ అయేషా రుమానా అనే ఓ మహిళ తన భర్త వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నానని, తను పెట్టే చిత్ర వధ భరించలేక పోతున్నానని మొర పెట్టుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి వీడియో సందేశం ద్వారా కోరింది. తనను ఎలాగైనా ఈ నరకం నుంచి రక్షించి తనను తిరిగి ఇండియాకి తీసుకురావాలని లేఖ ద్వారా ఆ బాధిత మహిళ వేడుకుంది. ఇందుకు గాను భర్త పెట్టే వేధింపులను మొత్తం వీడియోల ద్వారా పూర్తిగా వివరించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మహిళ పడుతున్న బాధలకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో ఆమె పట్ల నెటిజన్లు సానుభూతి కురిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి బాధితురాలిని తన స్వస్థలం హైదరాబాద్‌కు తొందరగా తిరిగి పంపించేలా చూడాలని ట్విట్టర్ వేదికగా పలువురు నెటిజన్లు కోరుతున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌తో సహా కేంద్ర సహాయక బృందాలను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా కోరుతున్నారు.

కాగా, బాధిత మహిళ షేక్ అయేషా రుమానా తల్లి రెహానా బేగం భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు మరో లేఖ రాశారు. అందులో కూతురితో పాటు ఆమె ఐదుగురు పిల్లలను రక్షించి ఇండియాకి తిరిగి రప్పించేలా చూడాలని ఆమె కోరారు. అందులో ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ఆమె చెప్పుకొచ్చారు. హైదరాబాద్ నగరం పూల్ భాగ్ కు చెందిన తమ కూతురిని ఖాజీ సైఫుల్లా ఖాలిద్ అనే వ్యక్తితో 2013 జనవరిలో పెళ్లి జరిపించామని అన్నారు. పెళ్లయిన 6 నెలల తర్వాత తన కూతురిని తీసుకుని అల్లుడు సౌదీ వెళ్లిపోయాడు. తర్వాత వారికి ముగ్గురు పిల్లలు పుట్టారని చెప్పుకొచ్చారు. కానీ, పెళ్లయిన దగ్గర నుంచి భర్త చేతిలో తమ కూతురు చాలా బాధలు పడిందని, తనని వేరే ఎవరిని కలవకుండా కట్టడి చేసేవాడిని దీంతో తమ కూతురు నరకం అనునుభవించిందని లేఖలో పేర్కొన్నారు.

ఒక్కోసారి అల్లుడు సైకోలా ప్రవర్తించేవాడని, పెళ్లయిన ఐదేళ్ల వరకు కూతురిని ఇండియా తిరిగి రాకుండా చేశాడని బాధ వ్యక్తం చేశారు. గత 6 నెలల నుండి సౌదీ వెళ్లిన తన కూతురికి భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయని వాపోయింది. తమ కూతురిని బెల్ట్, కర్రతో చితకబాదేవాడని, ఒకసారి అయితే కత్తితో దాడి చేసి చంపే ప్రయత్నం కూడా చేశాడని బాధిత మహిళ తల్లి లేఖలో పేర్కొన్నారు. జూన్ 17న తండ్రి చనిపోయినా చివరి చూపునకు కూడా తన కూతురిని పంపలేదన్నారు. ఇండియా పంపించడానికి నిరాకరించాడని తెలిపారు. తన కూతురు పడుతున్న కష్టాల నుంచి రక్షించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

బాధిత మహిళ కన్నీరు పెట్టుకుంటూ పోస్ట్ చేసిన వీడియో చూసిన నెటిజన్లు స్పందించి అండగా నిలుస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఇండియాలోని మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎలాగైనా కేంద్రం సహకరించి బాధిత మహిళకు న్యాయం చేయాలని కోరుతున్నాయి.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే