Hyderabad: నెహ్రూ జూలాజికల్ పార్కులో దొంగలు పడ్డారు.. పుష్ప స్టైల్లో గుట్టుచప్పుడు కాకుండా స్మగ్లింగ్‌..

| Edited By: Shaik Madar Saheb

Jul 23, 2023 | 9:36 AM

Nehru Zoological Park: హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్​పార్కులో రెండు రోజుల క్రితం దొంగలు పడ్డారు. వీరు ఎత్తుకెళ్లింది జంతువులని అనుకుంటున్నారా..? కాదు.. కాదు.. గంధపు చెట్లను. పుష్ప స్టైల్‌లో ఏడు గంధపు చెట్ల నరికేసి..

Hyderabad: నెహ్రూ జూలాజికల్ పార్కులో దొంగలు పడ్డారు.. పుష్ప స్టైల్లో గుట్టుచప్పుడు కాకుండా స్మగ్లింగ్‌..
Nehru Zoological Park
Follow us on

Nehru Zoological Park: హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్​పార్కులో రెండు రోజుల క్రితం దొంగలు పడ్డారు. వీరు ఎత్తుకెళ్లింది జంతువులని అనుకుంటున్నారా..? కాదు.. కాదు.. గంధపు చెట్లను. పుష్ప స్టైల్‌లో ఏడు గంధపు చెట్ల నరికేసి.. చిన్న చిన్న దుంగలుగా చేసి.. జూపార్క్‌ దాటించేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి అక్కడ పెరుగుతున్నది గంధపు చెట్లని చాలామందికి తెలియదు. ఈ విషయం చాలా సీక్రెట్‌గా ఉంచారు అధికారులు. కానీ.. పుష్ప గాళ్లు కనిపెడతారుగా.. అదే జరిగింది. ఒకటి కాదు రెండు కాదు ఏడు చెట్లను నరికేసుకెళ్లిపోయారు. ఇది ఒక్కరోజులో జరిగింది కాదు. చెట్లు నరికిన విధానం చూస్తే.. కొన్ని రోజులుగా స్మగ్లింగ్‌ జరుగుతన్నట్లు తేల్చారు అధికారులు. జూపార్క్‌లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ స్మగ్లింగ్‌ వెనుక ఎవరున్నారు?

ఈనెల 20వ తేదీన ఈ విషయం బయటపడింది. అప్పటి నుంచి నిఘాపెట్టారు అధికారులు. కొన్ని దుంగలను అక్కడే కట్టలుగా ఉంచారు. వాటిని ఎవరైనా స్మగ్లింగ్‌ చేయడానికి వస్తారా అన్న కోణంలో నిఘా పెట్టారు. కాని మూడు రోజులైనా ఎవరూ రాకపోవడంతో.. జూపార్క్‌ అధికారులు ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేశారు. పార్కుకు రెండు వైపులా ఎంట్రన్స్​ ఉండడం …. ఆ రెండు ఎంట్రన్స్​లో ఏర్పాటు చేసిన సి.సి కెమెరాలను పరిశీలించినా ఆ గేట్​ల గుండా గంధపు దుంగలను తీసుకెళ్లడం లాంటి దృశ్యాలు కనిపించలేదు. అంతేగాకుండా నరికిన ఏడు గంధపు చెట్లనుంచి కొన్ని దుంగలు కనిపించకుండా పోయినా.. అవి ఎలా తస్కరించారన్నది మిలియన్​ డాలర్‌ ప్రశ్నగా మారింది. ఇది ఇంటి దొంగల పనే అని అనుమానిస్తున్నారు. 6 ఏళ్లలో ఐదు సార్లు స్మగ్లర్లు ఈ చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఒక్కరు కూడా పట్టుబడక పోవడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..