Gas Cylinder Blast: నానక్‌రామ్ గూడలో భారీ పేలుడు.. 11 మందికి గాయాలు..
హైదరాబాద్ నానాక్‌రామ్‌గూడలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం జరిగిన గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో మొత్తం 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్ నానాక్‌రామ్‌గూడలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం జరిగిన గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో మొత్తం 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి పెద్ద శబ్ధాలతో మూడంతస్తుల భవనం పూర్తిగా నేలమట్టమైంది. దీంతో స్థానికులు ఉలిక్కపడ్డారు. కాగా ఒక గ్యాస్ సిలిండర్ కు మూడు కనెక్షన్స్ ఇవ్వటం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో ఒకదానిని ఆఫ్ చేయకపోవడంతో గ్యాస్ లీకేజీ అయిందని.. మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో లైట్స్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా ఈ భారీ పేలుడు సంభవించిందని తెలుస్తోంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులంతా యూపీ, బిహార్ రాష్ట్రాలకు చెందినవారని తెలుస్తోంది. పొట్టకూటి కోసం భాగ్య నగరానికి వచ్చి పనులు చేసుకుంటున్నారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్‌లో సుమారు 50 మంది కార్మికులు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించామని, మరికొందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని వారు పేర్కొన్నారు.
Also Read:
AP Crime: చదివేది ఇంజనీరింగ్.. చేసేది దొంగతనాలు.. జల్సాలకు పోయి జైలుపాలయ్యారు
Bride Dharna: మరికాసేపట్లో పెళ్లి.. హ్యాండిచ్చిన వరుడు.. ధర్నాకు దిగిన వధువు.. అసలేమైందంటే..?