Heavy Rains: తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు.. హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయం.. 11న అల్పపీడనం
Heavy Rains: ఒడిశా ఉత్తర ప్రాంతం నుంచి తెలంగాణ వరకు 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో..
Heavy Rains: ఒడిశా ఉత్తర ప్రాంతం నుంచి తెలంగాణ వరకు 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం మధ్యాహ్నం వరకు సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కపోతగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిశాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. నిన్న మధ్యాహ్నం నుంచి హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తోంది.
ఈ భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాళ్లన్నీ జలమయం అయ్యాయి. చందా నగర్10.25 సె.మీ, కప్రా10.13 సెం.మీ, ఉప్పల్ 9.53 సెం.మీ, బాలానగర్ 8.48 సెం.మీ, సరూర్ నగర్ 7.98 సెం.మీ, బేగంపేట 8.45 సెం.మీ, మూసాపేట 7.13 సెం.మీ, హయత్ నగర్ 7.98 సెం.మీ, ఖైరతాబాద్ 6.53 సెం.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే శేరిలింగంపల్లి సర్కిల్ 6.43, కూకట్‌పల్లి, 5.48, అమీర్‌పేట్ 4.78, షేక్‌పేట్ 4.75, మల్కాజిరి 5.25, జూబ్లీహిల్స్ 5.1, ఎల్.బి నగర్ 5.3 సెం.మీ వర్షపాతం నమోదైంది.
ఇక ఏపీలోని విజయనగరం నుంచి నెల్లూరు జిల్లా వరకు వర్షాలు కురిశాయి. రాయలసీమ ప్రాంతంలో చెదురుమదురు జల్లులు పడ్డాయి. రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులు పడ్డాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, అనేక చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. అలాగే కోస్తా తీరం వెంట గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈనెల 11న పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది వాతావరణ శాఖ తెలిపింది. అయితే భారీ వర్షం కారణంగా హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అయితే రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షం కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా జాగ్రత్తలు చేపడుతోంది.