CM Yogi at Hyderabad: నేడు హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం రెండు రోజుల పాటు జరగనుంది. ఈరోజు, రేపు నగరంలోని టెక్ హబ్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పార్టీ సీనియర్ నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో నేడు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించాల్సిందిగా బిజెపి తెలంగాణ సీఎం యోగికి అభ్యర్థన పంపగా.. ఆయన తన అంగీకారాన్ని మంగళవారం తెలిపారు.
అయితే ఐకానిక్ చార్మినార్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని నేడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మహంత్ యోగి ఆదిత్యనాథ్ మహారాజ్ సందర్శించాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన.. ఈ కార్యక్రమం వాయిదా పడింది. రేపు(జూన్ 3వ తేదీ)న చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి మాత మందిరాన్ని యూపీ సీఎం యోగి సందర్శించి పూజలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం యోగికి ఘన స్వాగతం పలకడానికి.. అమ్మవారి ఆలయంలో జరగనున్న మహా హారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో హిందువులు తరలిరావాలని తెలంగాణ బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. అయితే ఈ ప్రాంతం AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ రాజకీయ గడ్డపై ఉంది. ఇప్పటికే అసదుద్దీన్ ఒవైసీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని యోగి దర్శించడంపై సర్వత్రా ఆసక్తినెలకొంది. మరోవైపు చార్మినార్ వద్ద పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
2020 హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలలో పార్టీ కోసం విస్తృతంగా సీఎం యోగికి ప్రచారం చేశారు. బీజేపీకి భాగ్యనగర ప్రజలు అపూర్వమైన విజయాన్ని కట్టబెట్టారు. 47 స్థానాలను గెలుచుకుంది. రెండేళ్ల కిందటేకేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. అయితే, యోగి అప్పుడు ఆలయాన్ని సందర్శించలేదు, కానీ హైదరాబాద్‌కు భాగ్యనగర్‌గా పేరు మార్చాలని పిలుపునిచ్చారు.
గోషామహల్ ఎమ్మెల్యే,తెలంగాణ అసెంబ్లీలో బిజెపి ఫ్లోర్ లీడర్ టి రాజా సింగ్ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం.. ఆలయాన్ని సందర్శించి పూజాదికార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తారని తెలిపారు. యోగి బహిరంగ సభలో ప్రసంగించరని చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..