AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bullet Train: హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌పై బిగ్ అప్డేట్.. ప్రభుత్వం లైన్ క్లియర్..

కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా ఏడు బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టులను ప్రకటించిన విషయం తెలిసిందే. వీటి పనులు ఇప్పుడు షురూ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వీటిని నిర్మించేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఈ క్రమంలో ప్రాజెక్టుపై మరో కీలక ముందడుగు పడింది.

Bullet Train: హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌పై బిగ్ అప్డేట్.. ప్రభుత్వం లైన్ క్లియర్..
Bullet Train
Venkatrao Lella
|

Updated on: May 04, 2026 | 12:27 PM

Share

హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్‌కు మార్గం సుగమమైంది. కేంద్రం ఇటీవల బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఈ మార్గానికి కర్ణాటక కేబినెట్ కూడా తాజాగా ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ ప్రాజెక్టుపై మరో ముందడుగు పడినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టులను అన్ని మార్గాల్లో కేంద్రం చేపడుతోంది. భూసేకరణ, ఇతర అనుమతులతో పాటు అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదిస్తోంది. భూసేకరణకు అడ్డంకులు రాకుండా చూసుకోవడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు కూడా కోరుతోంది. హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్ రైలు మార్గానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం  ప్రకటించగా.. ఏపీ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం కూడా ఆమోదించింది. దీంతో ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెరగనుంది.

2 గంటల్లోనే బెంగళూరుకు..

ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రెండు గంటల్లోనే హైదరాబాద్-బెంగళూరు మధ్య ప్రయాణం చేసే సౌకర్యం అందుబాటులోకి వస్తుందని రైల్వేశాఖ చెబుతోంది. ప్రస్తుతం ఈ రెండు సిటీల మధ్య రైళ్లల్లో ప్రయాణించాలంటే 8 నుంచి 19 గంటల సమయం పడుతుంది. ఇక వేగంగా వెళ్లే రైళ్లల్లో కూడా 8 గంటల సమయం పడుతుంది. అదే బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వస్తే 2 గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ రెండు నగరాల మధ్య తరచూ ఉద్యోగులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తూ ఉంటారు. ఇలాంటివారికి బుల్లెట్ రైళ్లు వేగవంతమైన ప్రయాణం సౌకర్యం కల్పించనున్నాయి. ఈ కారిడార్ 626 కిలోమీటర్ల మేర ఉంటుంది. 101 కిలోమీటర్లు కర్ణాటకలో ఉంటుంది. అలీపుర, దేవనహళ్లి, కోడిహళ్లి రైల్వే స్టేషన్లు కర్ణాటకలో ఏర్పాటు చేయనున్నారు.

వచ్చే ఏడాదిలో డీపీఆర్ సిద్దం

ఇక ఏపీలో హిందూపురం, అనంతపురం, కర్నూలులో స్టేషన్లు ఉండనుండగా.. తెలంగాణలో మహబూబ్ నగర్‌లో స్టేషన్ ఉండనుంది. మొత్తం 12 స్టేషన్లు ఉంటాయని తెలుస్తోంది. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ఈ మార్గంలో బుల్లెట్ రైళ్లు ప్రయాణిస్తాయి. ఎలివేటెడ్ కారిడార్‌పై లైన్ నిర్మించనున్నారు. సర్వే పనులను రైట్స్ లిమిటెడ్ ఇటీవల చేపట్టింది. 2027 మార్చిలో డీపీఆర్ పూర్తి కానుందని తెలుస్తోంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఈ కారిడార్ ప్రారంభమవుతుందని సమాచారం. ఇక కర్ణాటకలో భూసేకరణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఒక నోడల్ అధికారిని నియమించాలని కేంద్రాన్ని కర్ణాటక ప్రభుత్వం కోరింది. అటు హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-పుణె కారిడార్లను కూడా కేంద్రం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించే ప్రక్రియ కూడా జరుగుతుంది.

Follow Us