Hyderabad: ఓరి బాబోయ్.. పెళ్లికి వెళ్తే.. కొంప కొల్లేరు చేశారు కదరా..!
హిమాయత్ నగర్‌లో నివాసం ఉండే బిజినెస్‌మేన్ రోహిత్ కేడియా ఓ మ్యారేజ్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఫ్యామిలీతో కలిసి ఫిబ్రవరి 10న దుబాయ్‌కి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని పసిగట్టిన దొంగలు.. పక్కాగా ప్లాన్ చేసి.. చోరికి వచ్చారు. ఇంట్లో అమర్చిన సీసీ కెమెరా అసలు నిందితుడిని పట్టించేసింది.

హైదరాబాద్ మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇన్ని సీసీ కెమెరాలు ఉన్న, పోలీసుల యాక్షన్, ట్రాకింగ్ ఓ రేంజ్‌లో ఉన్నా తగ్గేదేలే అన్నట్లు చెలరేగిపోతున్నారు. తాజాగా హిమాయత్ నగర్‌లోని ఓ వ్యాపారి ఇంటిని కొల్లగొట్టారు. అతని ఇంటి నుంచి సుమారు రూ.2 కోట్ల విలువైన గోల్డ్, రూ.25 లక్షల క్యాష్ చోరీకి గురైనట్లు నారాయణగూడ పోలీసులు వెల్లడించారు. కాగా ఈ కేసులో నిందితుడిని పట్టేశారు పోలీసులు. నిందితుడు సుశీల్‌ను నాగ్‌పూర్ దగ్గర అదుపులోకి తీసుకున్న పోలీసులు, హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.
హిమాయత్ నగర్‌లో నివాసం ఉండే బిజినెస్‌మేన్ రోహిత్ కేడియా ఓ మ్యారేజ్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఫ్యామిలీతో కలిసి ఫిబ్రవరి 10న దుబాయ్‌కి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని పసిగట్టిన దొంగలు.. పక్కాగా ప్లాన్ చేసి.. చోరికి వచ్చారు. బీరువాను ఓపెన్ చేసి లోపల ఉన్న గోల్డ్‌తో పాటు నగదును ఎత్తుకెళ్లారు. దొంగల పడ్డ విషయాన్ని గుర్తించిన రోహిత్ కేడియా మేనేజర్ అభయ్ బుధవారం నారాయణగూడ పోలీసులకు కంప్లైంట్ చేశారు.
ఫిర్యాదు మేరకు వెంటనే యాక్షన్‌లోకి దిగిన పోలీసులు క్లూస్ టీం సాయంతో ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. బీరువాలో దాచి ఉన్న రూ.2 కోట్ల విలువ చేసే గోల్డ్, క్యాష్ చోరీకి గురైనట్లుగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలంలో ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరించారు. ఇంత పక్కాగా దొంగతనం చేయడంతో.. తెలిసిన వారు చేసిన పనే అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి నిందితుల కోసం వేట మొదలు పెట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా సుశీల్ అనే వ్యక్తిని నాగ్‌పూర్‌లో అరెస్టు చేసి విచారణ నిమిత్తం హైదరాబాద్ తీసుకువచ్చారు. చోరీ సొత్తు రాబట్టేందుకు యత్నించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..