Hyderabad: ఛీ ఛీ అసలు తల్లేనా.. ప్రియుడితో పడక సుఖానికి అడ్డొస్తుందని కన్న కొడుకునే..
Hyderabad: నాన్న నమ్మకం.. అమ్మంటే నిజం.. అభం శుభం తెలియని చిన్నారులకు అమ్మే ఓ లోకం. కానీ ప్రస్తుత కాలంలో మాతృత్వం కూడా మసక బారుతోంది.
Hyderabad: నాన్న నమ్మకం.. అమ్మంటే నిజం.. అభం శుభం తెలియని చిన్నారులకు అమ్మే ఓ లోకం. కానీ ప్రస్తుత కాలంలో మాతృత్వం కూడా మసక బారుతోంది. తాజాగా ముషీరాబాద్‌లో వెలుగుచూసిన ఓ నిజం.. సభ్య సమాజాన్ని నివ్వెరపర్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మూడేళ్ల బిడ్డను ప్రియుడితో హత్య చేయించిన ఓ మహిళ నిర్వాకం సంచలనం రేపింది.
వివరాల్లోకెళితే.. ముషీరాబాద్ ఏరియాలోని పార్శిగుట్టలో ఈ నెల 8న మూడేళ్ల చిన్నారి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ప్రమాదవశాత్తు కుర్చీపై నుంచి పడిపోవడం వల్లే చనిపోయాడనుకున్నారంతా. పేరెంట్స్ కూడా పోలీసులకు అదే సమాచారం ఇచ్చారు. కానీ దర్యాప్తులో సంచలనాలు వెలుగులుచూశాయి. ప్రమాదవశాత్తు కాదు పక్కా ప్లాన్డ్ మర్డర్ అని తేలింది. అయితే, మూడేళ్ల చిన్నారిని చంపాల్సిన పగ ఎవరికి? ఎందుకు? ఉంది అని కూపీలాగితే రవి, నాగలక్ష్మి అఫైర్ క్రైమ్ కథా చిత్రమ్ తెరపైకి వచ్చింది.
నిజామాబాద్ జిల్లాకు చెందిన శివ – నాగలక్ష్మి దంపతులు. వాళ్లకు ఇద్దరు పిల్లలు. ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. శివ వృత్తిరీత్యా పేయింటర్. నాగలక్ష్మీ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండేది. ఇక రవిది కూడా నిజామాబాద్ జిల్లా. హైదరాబాద్‌లో సెంట్రింగ్ వర్కర్. ఆయనకు ఇద్దరు భార్యలు. వీడి వాలకం చూసి ఇద్దరు భార్యలూ అతన్ని వదిలి పెట్టారు. ఆ క్రమంలోనే నాగలక్ష్మికి క్లోజయ్యాడు రవి. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. తమకు అడ్డుగా వున్నాడని మూడేళ్ల బిడ్డను బలితీసుకున్నారు. ప్రమాదవశాత్తు చనిపోయాడని కట్టుకథ అల్లారు. కానీ దర్యాప్తులో నిప్పులాంటి నిజం తేలింది.
మూడేళ్ల బిడ్డను చంపాలనే ఆలోచన రావడమే దారుణం. అందుకు తల్లి పథకం వేయడం ఘోరం. ఇక పిల్లాణ్ని చంపిన తీరు తెలిస్తే.. వాడు మడిషా పశువా? ఇలాంటోడికి కోసి కారం పెట్టాలనే కోపం కట్టలు తెగడం ఖాయం. పసిబిడ్డను పొట్టన పెట్టుకున్న రవి.. తన ప్రియురాలు చెప్పినట్టుగా ఆమె భర్తకు ఫోన్ చేసి పిల్లాడు కుర్చీపై నుంచి పడి గాయపడ్డాడని చెప్పాడు. నంగనాచిలా హాస్పిటల్‌లో చేర్పించాడు. ఖాకీలకు డౌట్ రాకుంటే వాళ్ల ప్లాన్ వర్కౌట్ అయ్యేదే. పిల్లాడి ఒంటిపై అసాధారణ గాయాలను చూసి ఏదో తేడాగా ఉందని పసిగట్టిన పోలీసులు.. పక్కా ఆధారాలతో నిజాలను రాబట్టారు. రవిని అరెస్ట్ చేశారు. ఆరా తీస్తే వాడు నేరాన్ని ఒప్పుకున్నాడు. దర్యాప్తులో ఆ ఇద్దరూ కలిసి లేచిపోవాలనుకున్న ప్లాన్ కూడా రివీలైంది.
ఛీ..థూ.. ఇలాంటి మనుషులుంటారా? క్షణిక సుఖాల కోసం అభంశుభం తెలియని మూడేళ్ల బిడ్డను పొట్టన పెట్టుకున్న వీళ్లు మనుషులేనా? ఇలాంటి వాళ్లను జైల్‌లో వేసి మేపడం కాదు. ఉరితీయాలనే డిమాండ్ ప్రజల నుంచి ఊపందుకుంది. ఇక చిన్నారి అనుమానాస్పద మృతి కేసులో పక్కా మిస్టరీ చేధించడం సహా పక్కా ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు ప్రజలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..