YS Sharmila: సైదాబాద్‌లో వైఎస్ షర్మిల నిరవధిక దీక్ష భగ్నం.. అర్థరాత్రి అదుపులోకి..!

|

Sep 16, 2021 | 3:53 AM

Saidabad Rape Case: హైదరాబాద్‌లోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో పరారీలో

YS Sharmila: సైదాబాద్‌లో వైఎస్ షర్మిల నిరవధిక దీక్ష భగ్నం.. అర్థరాత్రి అదుపులోకి..!
Ys Sharmila
Follow us on

Saidabad Rape Case: హైదరాబాద్‌లోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడు రాజు కోసం.. వేయి మందికిపైగా పోలీసులు ముమ్మర గాలింపు చేపడుతున్నారు. ఉన్మాదిని చంపాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు సైతం వ్యక్తమవుతున్నాయి. అయితే.. బుధవారం చిన్నారి తల్లిదండ్రులను పలువురు ప్రముఖులు పరామర్శించారు. నిందితుడిని త్వరగా పట్టుకుని శిక్షించడమే కాకుండా.. బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. న్యాయం జరిగేంతవరకు అండగా ఉంటామంటూ జనసేనాని పవన్ కల్యాణ్, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రకటించారు.

ఈ క్రమంలో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని.. ఈ ఘటనపై తెలంగాణ సీఎం స్పందించాలంటూ ఆమె నిరాహార దీక్షకు కూర్చున్నారు. అయితే.. ఈ దీక్షకు విజయమ్మ కూడా మద్దతు తెలిపి ఆమె కూడా దీక్షలో కూర్చున్నారు. అయితే.. వైఎస్‌ షర్మిల చేపట్టిన దీక్షను హైదరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. బుధవారం అర్ధరాత్రి దాటాక పోలీసులు దీక్ష ప్రాంతానికి చేరుకుని వైఎస్సార్ టీపీ శ్రేణులను చెదరగొట్టి షర్మిల దీక్షను భగ్నం చేశారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదిలాఉంటే.. నిందితుడు పల్లకొండ రాజు కోసం పోలీసులు తీవ్ర గాలింపు చేపట్టారు. అన్ని చోట్ల నిఘాను పెంచారు. దీంతోపాటు నిందితుడి రాజుకు సంబంధించి మరిన్ని ఫోటోలు, క్లూస్‌ని హైదరాబాద్ నగర పోలీసులు విడుదల చేశారు. నిందితుడు రాజు ఆచూకీపై సమాచారం ఇచ్చేవారికి హైదరాబాద్ పోలీసు శాఖ రూ.10 లక్షల రివార్డు ప్రకటించడం తెలిసిందే. అతని ఆచూకీపై డీసీపీ(ఈస్ట్ జోన్)- 9490616366, డీసీపీ(టాస్క్ ఫోర్స్)- 9490616627కు సమాచారమివ్వాలని పోలీసులు కోరారు.

Also Read:

Saidabad case: ఒక్కడు.. 3 వేల మంది పోలీసులు.. వేలాది కెమెరాలు.. 6 రోజులు. ఎక్కడికి వెళ్లాడు.. ఎందుకు దొరకలేదు?

VC Sajjanar: సజ్జనార్ రూటే సపరేటు.. ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికుడిలా… తెలిసి అంతా షాక్..