చలికాలం వచ్చిందంటే చాలు, రోగనిరోధక శక్తి తగ్గిపోవడంతో చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు.
ముఖ్యంగా ఈ సమయంలో జలుబు, దగ్గు వంటి అనేక సమస్యలు వస్తుంటాయి. అందువలన శీతాకాలంలో ఆహారం విషయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు.
కాగా, ఇప్పుడు మనం చలికాలంలో బెండకాయ తినడం మంచిదేనా? ఈ సీజన్‌లో దీనిని తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.
చలికాలంలో చర్మం పొడిగా, రఫ్‌గా కనిపిస్తుంటుంది. అందువలన ఈ సీజన్‌లో బెండకాయ తినడం వలన ఇది చర్మానికి లోపలి నుంచి సహజ తేమను అందించి, చర్మాన్ని రక్షిస్తుంది.
చలికాలంలో బెండకాయ తినడం వలన కడుపు సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. ఇందులో ఉండే మ్యూసిలేజ్ పేగుల్లో సహజమైన జారుడుతనాన్ని పెంచి, మలబద్ధక సమస్యను నివారిస్తుంది.
ముఖ్యంగా చలికాలంలో దగ్గు, జలుబు, అలెర్జీ వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఈ సమయంలో బెండకాయ తినడం వలన ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, జలుబు, దగ్గు తగ్గిస్తుంది.
చలికాలంలో తేమ ఎక్కువగా ఉండటం వలన చాలా మంది ఎక్కువ నీరు తాగరు. దీంతో డీ హైడ్రేషన్ సమస్య వస్తుంది. అందువలన ఈ సమయంలో బెండకాయ తినడం వలన ఇది శరీరానికి సహజ తేమను అందిస్తుంది.
అంతే కాకుండా చలికాలంలో తప్పకుండా రెండు లేదా మూడు సార్లు బెండకాయ కర్రీ తినడం, బెండకాయ నీరు తాగడం వలన శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.