తెలంగాణ మటన్ ఫ్రై.. ఇలా చేస్తే కారం కారంగా అదిరి పోయే టేస్ట్!
samatha
Pic credit - Instagram
మటన్ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు. చాలా మందికి మటన్ అంటే ఇష్టం ఉంటుంది. అయితే తెలంగాణ స్టైల్‌లో మటన్ ఫ్రై చేస్తే ఆ టేస్ట్ వేరే లెవల్ ఉంటది.
కాగా, ఇప్పుడు మనం తెలంగాణ స్టైల్‌లో , కారం కారంగా, సూపర్ టేస్ట్ ఇచ్చే విధంగా, ఎలా చేయాలో చూసేద్దాం పదండి. కావాల్సిన పదార్థాలు : మటన్ కేజీ, పచ్చి మిర్చి 4, ఆనియన్ 2,
కారం రుచికి సరిపడ, ఉప్పు రుచికి సరిపడ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, పూదీన కప్పు, వెల్లుల్లి రెబ్బలు కప్పు, ఎండు మిర్చి మూడు, గరం మసాలా పౌడర్ టీ స్పూన్, ధనియాల పొడి వన్ స్పూన్, పసుపు చిటికెడు.
ముందుగా మటన్ ఒక బౌల్‌లో తీసుకొని, దానికి కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, మసాలా, ధనియాల పొడి వేసి, మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి అందులో మటన్ ఫ్రై అవ్వడానికి సరిపడ నూనె పోయాలి. తర్వాత నూనె వేడి అయిన తర్వాత పచ్చి మిర్చి, లవంగాలు, ఆనియన్ వేసి మంచిగా వేయించుకోవాలి.
తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండు మిర్చి , కొంచెం పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ వేయాలి.
మటన్ మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత అందులో సరిపడ కారం, ఉప్పు, గరం మసాలా వేసి మళ్లీ మంచిగా ఫ్రై చేసుకోవాలి.
ఆ తర్వాత మటన్ మంచిగా ఉడికి ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి వేసి రెండు నిమిషాలు ఫై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో కొత్తిమీర, పూదీన వేసి, రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే తెలంగాణ స్టైల్ మటన్ ఫ్రై రెడీ.