Hyderabad News: పొంగి పొర్లిన మందు.. అమ్మాయిలతో చిందులు.. అంతలోనే ఊహించిన ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు..

Hyderabad News: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో అశ్లీల నృత్యాలు కలకం రేపాయి. ఎల్బీనగర్ పరిధిలోని నాగోల్ బండ్లగూడలో ల్యాండ్ మార్క్ అనే రియల్ ఎస్టేట్..

Hyderabad News: పొంగి పొర్లిన మందు.. అమ్మాయిలతో చిందులు.. అంతలోనే ఊహించిన ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు..
Land Mark

Updated on: Oct 12, 2021 | 1:59 PM

Hyderabad News: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో అశ్లీల నృత్యాలు కలకం రేపాయి. ఎల్బీనగర్ పరిధిలోని నాగోల్ బండ్లగూడలో ల్యాండ్ మార్క్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ 5వ వార్షికోత్సవం సందర్భంగా పిఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో పార్టీని నిర్వహించారు. ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే.. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ పార్టీని నిర్వహించింది ల్యాండ్ మార్క్ యాజమాన్యం. ఈ పార్టీలో మద్యం ఏరులై పారింది. అంతటితో ఆగని నిర్వాహకులు.. అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున డీజే సౌండ్స్ పెట్టారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. డీజే సౌండ్ మోత మోగించడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

స్థానిక ఫోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే, విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ పోలీసులు.. గుట్టుచప్పుడు కాకుండా నేరుగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. పార్టీని స్టాప్ చేయించారు. ఆర్గనైజర్ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రవీంద్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు కంపెనీ యాజమాన్యానికి చెందిన పలువురుని, ఈవెంట్ ఆర్గనైజర్స్‌ని అరెస్ట్ చేశారు. కాగా, డ్యాన్సర్స్ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఫంక్షన్ హాల్ నిర్వాహకులను కూడా పోలీసులు హెచ్చరించారు.

Also read:

PM Narendra Modi: అలాంటి వారితో దేశానికి ప్రమాదం.. అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని మోదీ

Roja: ప్రత్యేకత చాటుకున్న నగరి ఎమ్మెల్యే రోజా.. సీఎం జగన్‎కు ప్రత్యేక శాలువాతో సత్కారం..

Viral Video: ఇంట్లోకి దూరి హంగామా చేసిన పిల్ల ఎలుగుబంటి.. నవ్వులు పూయిస్తున్న వీడియో..