Telangana: అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు హైదరాబాద్ నిజాం.. సంపద ఏంత..? ఆ తర్వాత ఏమైంది..?

|

Sep 15, 2022 | 1:07 PM

అతను అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. ఆ సమయంలో అతని వద్ద లెక్కలేనంత సంపద ఉండేదని సమాచారం.

Telangana: అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు హైదరాబాద్ నిజాం.. సంపద ఏంత..? ఆ తర్వాత ఏమైంది..?
1
Follow us on

Telangana: అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు హైదరాబాద్ నిజాం.. సంపద ఏంత..? ఆ తర్వాత ఏమైంది..?
హైదరాబాద్ సెప్టెంబర్ 1948లో భారతదేశంలో విలీనం చేయబడింది. హైదరాబాద్‌ భారత్‌లో చేరి 76 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు హైదరాబాద్‌ ఏకీకరణ దినోత్సవం సెప్టెంబర్‌ 17న రాబోతోంది. దీనిని ప్రభుత్వం హైదరాబాద్‌ విమోచన దినోత్సవంగా జరుపుకుంటుండగా, కొన్ని పార్టీలు తిరుగుబాటు దినంగా కూడా జరుపుకుంటున్నాయి. హైదరాబాదులో సమైక్యత గురించి మాట్లాడినప్పుడు.. ఇక్కడ నిజాం గురించి మాట్లాడటం తప్పనిసరి. కాబట్టి ఈ రోజు మనం హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ గురించి తెలుసుకుందాం..అతని సంపద, లోపాల గురించి చాలా విషయాల్లో చాలా చర్చలే ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో హైదరాబాద్ ఏడవ నిజాంకు ఎంత ఆస్తి ఉందో..? అతని ఆస్తికి సంబంధించిన వివాదం ఏమిటి..? అలాగే, హైదరాబాద్ నిజాంతో అనుబంధం ఉన్న వారి కథల గురించి కూడా తెలుసుకుందాం..

ఆస్తి ఎంత?

హైదరాబాద్ చివరి నిజాం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడనే వాదనలు కూడా ఉన్నాయి. అప్పట్లో అతను భారతదేశంలో అత్యంత ధనవంతుడుగా పరిగణించబడ్డాడు..అతని చర్చలు ప్రపంచవ్యాప్తంగా నడిచాయి. ఆ సమయంలో టైమ్ మ్యాగజైన్ కవర్‌పై అతని ఫోటోను కూడా ముద్రించింది. అతను అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. ఆ సమయంలో అతని వద్ద లెక్కలేనంత సంపద ఉండేదని సమాచారం.
1980- 90ల నాటికి, నిజాం ప్రపంచంలోని 10 మంది ధనవంతులలో ఒకడు. అతని సంపద గురించి అధికారిక రికార్డులు లేనప్పటికీ, స్వాతంత్ర్యం వచ్చిన కాలంలో కూడా అతను 130 బిలియన్ రూపాయల యజమాని అని పలు నివేదికల ఆధారంగా చెప్పబడింది.. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు ఇతర నిజామ్‌ల మాదిరిగా పెద్దగా అభిరుచి లేదు. అతను బట్టలు మొదలైన విలాసాలు వాటిపై ఎక్కువ ఖర్చు పెట్టలేదు. అయితే అతని వద్ద ఒక పేపర్ వెయిట్ ఉందని.. అది 185 క్యారెట్ల వజ్రాలతో తయారు చేయబడింది. ఇది కాకుండా అతని హాబీలు కూడా అతి సాధారణమైనవిగా ఉండేవాడు. ఒక నివేదికలో అతని మొత్తం సంపద ఆ సమయంలో $ 236 బిలియన్ల కంటే ఎక్కువగా ఉన్నట్టు అంచనా వేయబడింది. ఆ సమయంలో ప్రపంచంలో ఎవరికీ అంత డబ్బు లేదని తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి