
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పని చేసే పారిశుద్ధ్య కార్మికులకు ఇది నిజంగా బిగ్ రిలీఫ్. దంచికొడుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. పారిశుద్ధ్య కార్మికుల పని వేళల్లో మార్పులు చేసింది. వేసవి కాలం, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 5 గంటల లోపు బయోమెట్రిక్ హాజరై.. మధ్యాహ్నం 12 గంటల వరకు విధులు నిర్వహించాలని జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్ తెలిపారు. ఈ పని వేళలు వేసవి కాలం ముగిసే వరకు కొనసాగుతాయని తెలిపారు. ఈ మేరకు కమిషనర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొనే పారిశుధ్య కార్మికుల పని వేళలు మార్చినట్లు కమిషనర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..