AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honey trap: హోమ్‌ డెలివరీ పేరుతో హనీ ట్రాప్‌.. తీగలాగితే అసలు కథ బయట పడిందోచ్.. మల్లెపూల గుట్టుతో..

సన్నగా నవ్వారని . కూల్‌ కూల్‌గా ఫిదా అయి..చాటింగ్‌లో మునిగి తేలితే..రంగుపడుద్ది. హైదరాబాద్‌లో అదే జరిగింది. ఓవైపు గొలుసు దొంగల హల్‌ చల్‌ హడలెత్తిస్తోన్న వేళ.. మరోవైపు వలవు వల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఎస్‌.. అమ్మాయిలను ఎరగా వేసి నిలువుదోపిడి చేస్తోన్న హనీట్రాప్‌ గ్యాంగ్‌కు చెక్‌ పెట్టారు హైదరాబాద్‌ సెంట్రల్‌ జోన్‌ పోలీసులు.

Honey trap: హోమ్‌ డెలివరీ పేరుతో హనీ ట్రాప్‌.. తీగలాగితే అసలు కథ బయట పడిందోచ్.. మల్లెపూల గుట్టుతో..
Hyderabad Honey Trap
Sanjay Kasula
|

Updated on: Jan 16, 2023 | 8:54 PM

Share

ఏక్‌..దో ..తీన్‌ ..చార్‌ ..పాంచ్‌ ఔర్‌ కిత్‌నే ఆద్మీ థా? బేకార్‌ గ్యాంగ్‌లో షీ బీ షామీల్‌ హై ..అన్నమాట.. డౌట్‌ ఎందుకు ..దృశ్యం ఉండనే ఉందిగా ఇలా.. పోలీస్‌ గాడీలో ఏక్‌ శాల్తీ.. ఔర్‌ ఏక్‌ లేడీ పరారీ.. వీళ్లు అట్టాంటోళ్ల ఇట్టాంటోళ్లు కాదు బుజ్జా.. సెంటుకొట్టినంత ఈజీగా.. నిలువుదోపిడి చేసే ఇస్మార్ట్‌ కేటుగాళ్లు. వలపు వల వీళ్ల ఆయుధం మరి. ఇదిగిదిగో ఇలాంటి క్యాష్‌ పార్టీలే ఈ ముఠా టార్గెట్‌.. ఇలాంటోళ్ల ఫోన్‌ నెంబర్‌ సంపాదించి ఓ జవ్వనితో ఫోన్‌ చేయిస్తారు.ఇంకేం నరాలు జివ్వుమనే రేంజ్‌లో అంకుల్‌ ఫ్లాట్‌.. తరువాయి చిత్రమ్‌ డేటింగ్‌.. కుదిరితే ఏదైనా ఫ్లాట్‌లో లేదంటే హోటల్‌లో మీటింగ్‌.. ఇంటికి ఏనాడైనా కనకంబరాలు తీసుకెళ్లాడో లేదో కానీ ..ఇక్కడికి మాత్రం మూడు మూరల మల్లెపూలతో హాజరు.. ఆమెకు తలలో మల్లెలు.. అంకుల్‌కు చెవిలో పువ్వులు.. నెక్ట్స్‌ సీన్‌ కెవ్వుకేకే..

ఇదిలావుంటే, అసలు కథలోకి వచ్చేద్దాం.. హైదరాబాద్‌లో హనీ ట్రాప్‌ ముఠా గుట్టు రట్టు అయ్యింది. ఈ కేసులో​ఓ మహిళతో సహా 9 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హోమ్‌ డెలివరీ పేరుతో ఓ మహిళ నగరంలో కొందరు వ్యక్తులను హనీ ట్రాప్‌ చేస్తోందన్నారు పోలీసులు.. యువకులతో పరిచయం పెంచుకున్న మహిళ.. వారితో సన్నిహితంగా ఫొటోలు దిగుతోంది. ఇలా వారిలో ఫొటోలు దిగిన మరుసటి రోజే.. మహిళతో పాటు గ్యాంగ్‌ సభ్యులు ఇంటి దగ్గర ప్రత్యక్షమవుతారు. ఫొటోలు దిగి మహిళను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ టార్గెట్‌ చేసిన వారి ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టిస్తారు.

బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ముఠా గుట్టు రట్టయింది. సెంట్రల్‌ జోన్‌ పరిధిలోని పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. అనంతరం, హనీ ట్రాప్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టిన తరువాత కస్టడీకి కోరే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్