Huzurabad By Election: మరికొన్ని గంటలే.. హుజూరాబాద్‌లో రాజకీయ సందడి.. నామినేషన్లు వేసేందుకు క్యూ..
హుజూరాబాద్‌లో మరో రెండు గంటలే మిగిలి ఉంది. దీంతో నామినేషన్లే వేయడానికి పెద్ద ఎత్తున ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు.. ప్రధాన పార్టీల అభ్యర్థులు క్యూ కట్టారు

హుజూరాబాద్‌లో మరో రెండు గంటలే మిగిలి ఉంది. దీంతో నామినేషన్లే వేయడానికి పెద్ద ఎత్తున ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు.. ప్రధాన పార్టీల అభ్యర్థులు క్యూ కట్టారు. టీఆర్‌ఎస్ తరపున ఇప్పటికే నామినేషన్ వేసిన ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్..ఇవాళ మరోసారి సెట్ నామినేషన్ వేశారు. ఆయన వెంట మంత్రి హరీష్‌రావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇటు కాంగ్రెస్ తరపున ఆ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్ వేశారు. ఆయన వెంట పార్టీ సీనియర్లు దామోదర రాజనర్సింహ్మ, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. చివరి రోజు భారీగా నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
హుజురాబాద్ ఉపఎన్నిక నామినేషన్స్ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు. హుజురాబాద్ బైపోల్‌కు కారణమైన బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ ఈరోజు నామినేషన్ వేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగానే స్క్రూట్నీ ప్రారంభంకానుంది. అక్టోబర్ 11న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 13వరకు గడువు ఉంది. ఇక, ఈనెల 30న పోలింగ్ జరగనుండగా… నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేయనున్నారు.
అధికార పార్టీ టీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉండగా, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ పోటీ చేస్తున్నారు. ఇక, బీజేపీ నుంచి బరిలోకి దిగనున్న ఈటల రాజేందర్ ఇవాళ నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు.
ఇవి కూడా చదవండి: Tomato Price: బాబోయ్ కిలో టమాటా ధర ఇంతా.. రైతుల దగ్గర నుంచి రైతు బజార్‌ల వరకు ధరలకు మళ్లీ రెక్కలు
Tea History: నిద్రమత్తును వదిలించే చాయ్.. మొదట్లో ఎందుకోసం తయారు చేసేవారో తెలిస్తే షాక్ అవుతారు..
Dosa War: దేశాన్ని రెండుగా విడగొట్టిన దోస.. మాడిపోయిన దోసపై నెట్టింట్లో రచ్చ రచ్చ.. ఏం జరిగిదంటే..