ఇటీవల కాలంలో క్షణికావేశంలో విపత్కర నిర్ణయాలు తీసుకుంటున్నారు. చిన్న, చిన్న విషయాలకు విలువైన జీవితానికి ముగింపు పలుకుతున్నారు. ఆలూమగలు అంటే చిన్న, చిన్న సమస్యలు సర్వసాధారణం. అభిప్రాయాల బేధాలు వస్తూనే ఉంటాయి. సర్దుకుపోతే సమస్యలు ఉండవు. ఈగోలకు పోతే.. కాపురం కల్లోలం అవుతుంది. మనసు విప్పి 10 నిమిషాలు మాట్లాడితే.. ఏ ఇష్యూ అయినా సాల్వ్ చేసుకోవచ్చు. అయితే కొందరు మొండి ఘటాలు నిర్ధాక్షణ్యంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా.. హైదరాబాద్‌లో ఓ వ్యక్తి భార్య తిట్టిందని సూసైడ్ చేసుకున్నాడు.
వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ ఔట్ కట్స్..అమీన్‌పూర్ పురపాలక బీరంగూడ మంజీరానగర్‌లో ఉంటున్న శ్రీనివాస్(29), రమణ దంపతలు. లిక్కర్ బాగా సేవించే శ్రీనివాస్ ఏ పని చేయకుండా ఇంటివద్దే ఉంటున్నాడు. ఈ విషయమై దంపతుల మధ్య గత కొంతకాలంగా విబేధాలు వస్తున్నాయి. ఇద్దరూ మాటలు అనుకుంటున్నారు. శుక్రవారం ఉదయం ఇదే విషయమై మరోసారి వాగ్వాదం జరిగింది. సంపాదించకుండా ఇంటివద్దే ఉంటే ఎలా అంటూ గొడవపడిన రమణి.. కూలి పనులకు వెళ్లింది.
భార్య తిట్టిందని నొచ్చుకున్న శ్రీనివాస్.. క్షణికావేశంతో విపరీత నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లోనే చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. రమణ ఫోన్‌చేస్తే రెస్పాన్స్ లేకపోవడంతో తన బావ సైదులుకు ఫోన్ చేసి చెప్పింది. సైదులు కుమారుడు సాగర్ వెళ్లి చూడగా.. శ్రీనివాస్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే కిందికి దించి హాస్పిటల్‌కు తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఘనటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పని చేయకుండా భార్య తిట్టిందని ఆత్మహత్య చేసుకోవటంతో అందరూ విస్తుపోతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..