AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అర్ధరాత్రి వణికిన బంజారాహిల్స్.. కేబీఆర్ పార్క్ దగ్గర ఊపిరిబిగపట్టే సీన్.. వీడియో చూస్తే

హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 ప్రాంతంలో ఉన్న కేబీఆర్ పార్క్ వద్ద ఓ పెద్ద పాము రోడ్డు దాటుతూ కనిపించింది. నడిరోడ్డుపైకి రాగానే ఆ మార్గంలో వెళ్తున్న కొందరు ఆ పామును చూసి అక్కడికక్కడే వాహనాలు నిలిపివేశారు. మరికొంతమందేమో ఎందుకొచ్చిన తంటాలు అనుకుంటూ తెగ భయపడిపోయి వాహనాలను తీసుకుని..

Hyderabad: అర్ధరాత్రి వణికిన బంజారాహిల్స్.. కేబీఆర్ పార్క్ దగ్గర ఊపిరిబిగపట్టే సీన్.. వీడియో చూస్తే
Hyderabad
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Dec 01, 2025 | 1:27 PM

Share

పాము అంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి..? దాన్ని చూస్తేనే ఆమడదూరం పారిపోతాం. విష జంతువు అని మనం ఎలా భయపడిపోతామో.. ఒక మూగజీవిగా దానికి మనుషులంటే భయం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. తనని ఏమైనా చేస్తారేమోనని.. జనాల్లోకి వస్తే చంపుతారేమో అనే అనుమానం దానికీ ఉంటుంది. ఇదిగో ఇలాగే ఓ పెద్ద పాము ప్రజలు సేద తీరేందుకు వచ్చే పార్కు నుంచి రోడ్డుమీదికి వచ్చేసింది. కాసేపు ఎటు పోవాలో తెలియక తికమక పడింది. ఆ సంగతులేంటో చూద్దాం రండి.

హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 ప్రాంతంలో ఉన్న కేబీఆర్ పార్క్ వద్ద ఓ పెద్ద పాము రోడ్డు దాటుతూ కనిపించింది. నడిరోడ్డుపైకి రాగానే ఆ మార్గంలో వెళ్తున్న కొందరు ఆ పామును చూసి అక్కడికక్కడే వాహనాలు నిలిపివేశారు. మరికొంతమందేమో ఎందుకొచ్చిన తంటాలు అనుకుంటూ తెగ భయపడిపోయి వాహనాలను తీసుకుని అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇదంతా జరుగుతుండగా, చుట్టూ చేరిన వాహనదారులు చూస్తుండగా ఆ పాముకు ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. అక్కడి నుంచి బయటపడాలని చాలా సేపే తచ్చాడింది. ఈ దృశ్యాలను కొంతమంది మొబైల్ ఫోన్లలో రికార్డు కూడా చేసుకున్నారు. ఈ తతంగం జరుగుతుండగా అంతా గమనించిన ఇద్దరు యువకులు మాత్రం కాస్త ముందుకు వచ్చి ఆ పామును అక్కడి నుంచి తప్పించడానికి ప్రయత్నం చేశారు. తిరిగి దాని దారి వెంట మళ్లీ పార్కులోకి వెళ్లేలా తోచిన పని చేశారు.. అక్కడి నుంచి ఆ పామును ముందుకు తరిమేసేలా చూశారు. పార్క్ లోపల నుంచి రోడ్డుపైకి వచ్చిన ఆ పాముని అతి కష్టం మీద ఆ ఇద్దరు యువకులు మళ్లీ పార్క్ వైపుకే మళ్లించి పంపించేశారు.

అయితే.. కేబీఆర్ పార్క్ అనేది నగరంలోని పెద్ద పేరున్న పార్క్. ఇక్కడికి చాలా మంది వాకింగ్ అని.. కాసేపు సేద తీరుదామని ప్రశాంతత కోసం వస్తూ వెళ్తూ ఉంటారు. అలాంటి సమయాల్లో విష సర్పాలు లాంటివి కనిపిస్తే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అందుకే పార్కులో వాకింగ్ చేసుకునేవాళ్లు, కాసేపు సమయం గడిపడానికి వచ్చేవాళ్లు ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఆ యువకులు సూచిస్తున్నారు. పొద్దున, సాయంత్రం వేళల్లో కేబీఆర్ పార్కులోకి వచ్చే సమయంలో కాస్త ముందూ వెనుక గమనిస్తూ వాకింగ్ లాంటివి చేసుకోవాలని, లేదంటే ప్రమాదం బారిన పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

Follow Us