ఉప్పుతో ముప్పు.. మీరు రోజూ తినే ఈ ఆహారాలతో కాస్త జాగ్రత్త!

07 May 2026

TV9 Telugu

TV9 Telugu

వంటకు రుచిని తీసుకురావడంలో ఉప్పు ముఖ్య పాత్ర పోషిస్తుంది. వంట‌లు రుచిగా ఉండాలంటే ఉప్పు వేయాల్సిందే. అయితే రోజువారీ ఆహారంలో ఉప్పు వినియోగం తెలిసో తెలియకో కాస్త ఎక్కువగానే ఉంటుంది

TV9 Telugu

అధిక సోడియం తీసుకోవడం గుండె ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనకు తెలియకుండానే తీసుకునే సోడియంలో 70 శాతానికి పైగా ప్యాకేజ్డ్ ఫుడ్స్‌, రెస్టారెంట్ ఆహారాల నుంచే వస్తోంది

TV9 Telugu

ఇవి రుచికి ఉప్పుగా అనిపించకపోయినా, లోపల సోడియం మోతాదు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అధిక సోడియం వినియోగం కేవలం రక్తపోటు పెరగడానికే కాదు, గుండె వ్యాధులు, కిడ్నీ సమస్యలు, ఎముకల బలహీనత, మెదడు సమస్యలు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది

TV9 Telugu

శరీరంలోని ద్రవ సమతౌల్యాన్ని దెబ్బతీసి, గుండెపై అదనపు ఒత్తిడిని పెంచుతుంది. దీర్ఘకాలంలో రక్తనాళాలు కఠినంగా మారి, గుండెపోటు, స్ట్రోక్‌ ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు సోడియం అధికంగా ఉండే ప్రధాన వనరులు

TV9 Telugu

ఫ్రోజన్ మీల్స్‌, కాన్డ్ సూప్స్‌, లంచ్ మీట్స్ వంటి వాటిలో నిల్వ ఉంచడానికి, రుచి కోసం ఎక్కువ ఉప్పు ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఇన్‌స్టంట్ ఓట్స్‌, సిరియల్స్ వంటి తీపి పదార్థాల్లో కూడా ప్రిజర్వేటివ్‌గా ఉప్పు వాడటం సాధార‌ణంగా మారింది

TV9 Telugu

చీజ్‌, ప‌చ్చళ్ళు కూడా అధిక సోడియం కలిగిన ఆహారాలు. ముఖ్యంగా ఒక స్పూన్ నిల్వ ప‌చ్చడిలో 300 నుంచి 600 మిల్లీగ్రాముల వరకు సోడియం ఉంటుంది. ప్యాకేజ్డ్ పనీర్‌లో కూడా నిల్వ కోసం ఉప్పు కలుపుతారు. క‌నుక ఈ ఆహారాల‌ను తీసుకునే విష‌యంలో జాగ్రత్తగా ఉండ‌డం చాలా అవ‌స‌రం

TV9 Telugu

ఇక సోడియం వినియోగాన్ని నియంత్రించడానికి కొన్ని సాధారణ అలవాట్లు చాలా ఉపయోగపడతాయి. ఆహార పదార్థాలపై ఉన్న న్యూట్రిషన్ లేబుల్స్‌ను తప్పనిసరిగా చదవాలి. తక్కువ సోడియం ఉన్న ఉత్పత్తులను ఎంపిక చేసుకోవాలి

TV9 Telugu

ఇంట్లో వంట చేసుకోవడం ద్వారా ఉప్పు పరిమాణాన్ని నియంత్రించవచ్చు. రుచి కోసం తాజా కూరగాయలు, మసాలాలు ఉపయోగించడం మంచిది. సోడియం వినియోగంపై అవగాహన పెంచుకుని, జాగ్రత్తగా ఆహారం ఎంచుకుంటే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సాధ్యమవుతుంది