AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రోడ్డుపై వెళ్తుండగా ఆటోడ్రైవర్‌కు కనిపించిన చిన్న బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా..

నిర్మల్ జిల్లాలో ఓ ఆటో డ్రైవర్‌ నిజాయతీకి నిదర్శనంగా నిలిచాడు. రోడ్డుపై దొరికిన రూ.16 లక్షల బంగారం, నగదు, గుర్తింపు పత్రాలు ఉన్న సంచిని యజమానికి క్షేమంగా అందించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి ..

Telangana: రోడ్డుపై వెళ్తుండగా ఆటోడ్రైవర్‌కు కనిపించిన చిన్న బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా..
Bag (representative image)
Ram Naramaneni
|

Updated on: Sep 08, 2025 | 7:59 AM

Share

తెలంగాణలోని కడెం ప్రాంతానికి చెందిన సుజాత నిర్మల్‌లో ఆరోగ్యమిత్రగా పనిచేస్తోంది. శనివారం సాయంత్రం ఆమె కుమారుడితో కలిసి బైక్‌పై ఖానాపూర్‌ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో కుమార్తె పెళ్లి కోసం చేయించిన 16 తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు, గుర్తింపు పత్రాలు ఉన్న సంచిని వాహనానికి కట్టారు. అయితే కొండాపూర్‌ బైపాస్‌ వద్ద ఆ సంచి కిందపడటాన్ని వారు గుర్తించలేదు.

అదే సమయంలో రాచాపూర్‌ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ సాయికుమార్ తన ఆటోలో ప్రయాణికులతో నిర్మల్‌ నుంచి కనకాపూర్‌ వైపు వెళ్తుండగా.. వడ్యాల్‌ గ్రామానికి చెందిన ప్రయాణికురాలు సౌజన్య రోడ్డుపై పడి ఉన్న సంచిని గమనించి డ్రైవర్‌కి తెలిపింది. వెంటనే సాయికుమార్‌ సంచిని తీసుకుని ఇంటికి తీసుకెళ్లాడు.

Also Read: పాములు అనుకుంటివా పుష్ప.. జర జాగ్రత్తగా చూడు అప్పా..

తర్వాత బంగారం పోయిందని సోషల్ మీడియాలో వచ్చిన సందేశాన్ని చూసిన సౌజన్య తన భర్త ద్వారా సాయికుమార్‌కి సమాచారం అందించింది. ఆదివారం సుజాతకు సమాచారం చేరగానే.. ఆమె వచ్చి తన బంగారం, నగదు, పత్రాలను తిరిగి తీసుకుంది. ఆటో డ్రైవర్ సాయికుమార్‌ నిజాయతీని మెచ్చుకున్న గ్రామస్థులు ఆయనను ఘనంగా సన్మానించి అభినందించారు.

Honest Auto Driver

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్