AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: పాములు అనుకుంటివా పుష్ప.. జర జాగ్రత్తగా చూడు అప్పా..

కాకినాడ తీరంలో మత్స్యకారుల వలలో పాముల్లా కనిపించే అరుదైన చేపలు చిక్కి స్థానికుల ఆసక్తిని రేపాయి. వీటిని నల్ల బొమ్మిడాయిలు లేదా పాముచేపలు అని పిలుస్తారు. ఆదివారం కుంభాభిషేకం రేవులో వీటిని విక్రయించగా.. కిలో ధర రూ.180 నుంచి రూ.250 వరకు పలికింది.

Andhra: పాములు అనుకుంటివా పుష్ప.. జర జాగ్రత్తగా చూడు అప్పా..
Eel Like Fish
Ram Naramaneni
|

Updated on: Sep 08, 2025 | 7:36 AM

Share

కాకినాడ తీరంలో మత్స్యకారుల వలలో అరుదైన చేపలు చిక్కి స్థానికుల దృష్టిని ఆకర్షించాయి. చూడగానే పాముల్లా కనిపించే ఈ జీవులు నిజానికి చేపలేనండోయ్‌. వీటిని స్థానికంగా నల్ల బొమ్మిడాయిలు లేదా పాముచేపలు అని పిలుస్తారు. సముద్ర గర్భంలో లోతైన ప్రదేశాల్లో వీటి వాసం ఉండటంతో తరచుగా వలల్లో చిక్కవు. అందుకే ఒక్కసారి పట్టుబడితేనే పెద్దగా చర్చనీయాంశంగా మారతాయి.

ఆదివారం తెల్లవారుజామున సముద్ర యాత్రకు వెళ్లిన మత్స్యకారుల వలకు వీటిలో అనేకం చిక్కాయి. తిరిగి తీరానికి వచ్చిన తర్వాత వాటిని కుంభాభిషేకం రేవు వద్దకు తీసుకువచ్చి విక్రయించారు. అరుదైనవి కావడంతో వాటిని చూడటానికి స్థానికులు, కొనుగోలు చేసేందుకు వ్యాపారులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు.

సైజు ఆధారంగా కిలో ధర రూ.180 నుంచి రూ.250 వరకు పలికింది. పెద్దవాటికి ఎక్కువ ధర, చిన్నవాటికి కొద్దిగా తక్కువ ధర లభించింది. వీటి మాంసం రుచికరంగా ఉంటుందట. సముద్రంలో అరుదుగా లభించడం వల్ల ఎప్పటికప్పుడు ఎక్కువ మొత్తంలో దొరకవు.

మత్స్యకారులు ఈ పాముచేపలను మంచి ధరకు అమ్మి సంతృప్తి వ్యక్తం చేశారు. తీర ప్రాంతాల్లోని జనాలు కూడా ఇవి సముద్రంలో ఎలా జీవిస్తాయో తెలుసుకోవడానికి ఆసక్తిగా వీటిని పరిశీలించారు. ఇలా కాకినాడ తీరంలో అరుదైన చేపలు చిక్కడంతో.. రేవు ప్రాంతం కాసేపు సందడిగా మారింది.

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్