Amit Shah: తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. అమిత్ షా ఖమ్మం జిల్లా షెడ్యూల్ ఇదే ..

AmitShah Telangana Tour: ఈ నెలలో నిర్వహించే సభల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారు. జూన్ 15న ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు.

Amit Shah: తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. అమిత్ షా ఖమ్మం జిల్లా షెడ్యూల్ ఇదే ..
Union Home Minister Amit Shah

Updated on: Jun 12, 2023 | 1:33 PM

తెలుగు రాష్ట్రాల్లో దూకుడుతో దూసుకుపోతోంది భారతీయ జనతా పార్టీ (బీజేపీ). రాబోయే ఎన్నికల్లో తెలంగాణ విజయ శంఖారావం పూరించాలనే లక్ష్యంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలు పెట్టింది ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. మోదీ 9 ఏండ్ల పాలనలో చేసిన అభివృద్ధిని వివరించేందుకు ‘మహాజన్ సంపర్క్ యాత్ర’లను ఎన్నికల శంఖారావ సభలుగా మార్చుకొనేందుకు రెడీ అవుతోంది. ఈ నెలలో నిర్వహించే సభల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారు. జూన్ 15న ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు.

విశాఖలో పర్యటించిన అమిత్ షా త్వరలో తెలంగాణ టూర్‌కు రానున్నారు. ఈమేరకు ఆయన షెడ్యూల్‌ విడుదల చేసింది బీజేపీ. ఈనెల 15వ తేదీన భద్రాచలంలో రాములవారి దర్శనంతో షా పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. దీని కోసం ముందుగా ఈనెల 15న ఉదయం 11గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి కేంద్ర మంత్రి అమిత్ షా చేరుకుంటారు. ఉదయం 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు అల్పాహారానికి కేటాయించారు. ఈ సమయంలో ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 1.10 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి భద్రాచలానికి బయల్దేరతారు.

భద్రచలంకు చేరుకున్న తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.20 మధ్యలో రాములవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల మైదానంలో బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. బహిరంగ సభ ముగిసిన అనంతరం సాయంత్రం 6 గంటలకు తిరిగి శంషాబాద్‌కు బయలుదేరుతారు.

రాత్రి 7 గంటలకు పలువురు నేతలతో విడి విడిగా సమావేశం నిర్వహిస్తారు. రాత్రి 9.30 గంటలకు శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో అమిత్‌షా ఢిల్లీకి వెళ్తారు. అయితే, తెలంగాణలో జరుగుతున్న కొన్ని కీలక పరిణాల నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షాకు అధిక ప్రదాన్యత ఏర్పడింది,

మరిన్ని తెలంగాణ వార్తల కోసం