Weather Update: తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో రానున్న రెండు రోజులకు రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. సగటు సముద్ర మట్టం 4.5 కి.మీ నుంచి 7.6 కి.మీ మధ్య కొనసాగుతుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఉత్తర జిల్లాలకు ఎల్లో జారీ చేసింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చాలా చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. మొత్తం 8 జిల్లాలకు అలెర్ట్ కొనసాగుతుంది.
కాగా, రాష్ట్రవ్యాప్తంగా బుధవారం సగటు 6.5 మి.మీ వర్షపాతం నమోదయింది. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 7.35 సెం.మీ వర్షపాతం. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 30 డిగ్రీల నుంచి 23 డిగ్రీలు వరకు ఉండే అవకాశం ఉంది. ఇంకా పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు దిగువ స్థాయి గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2, 3 రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..