Bandi Sanjay Arrest: బొమ్మలరామారంలో హైటెన్షన్.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్టు..
బండి సంజయ్‌ని అక్రమంగా అరెస్ట్ చేశారని బొమ్మలరామరం పోలిస్ స్టేషన్ దగ్గర బిజెపి నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీస్టేషన్ లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, బిజెపి నాయకుల మధ్య తోపులాట జరిగింది.

బండి సంజయ్ అరెస్టు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. బండి సంజయ్‌ని అక్రమంగా అరెస్ట్ చేశారని బొమ్మలరామరం పోలిస్ స్టేషన్ దగ్గర బిజెపి నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీస్టేషన్ లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, బిజెపి నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకు దిగిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో బొమ్మల రామారం పోలీస్టేషన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీజేపీ కార్యకర్తల నినాదాలతో బొమ్మల రామారం పోలీస్టేషన్ దద్దరిల్లింది. బొమ్మాల రామారం పోలీస్టేషన్ దగ్గరికి భారీగా బీజేపీ కార్యకర్తలు తరలివస్తుండటంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. పోలీస్టేషన్ చుట్టూ పోలీసులు మోహరించారు.
రఘునందన్ రావు అరెస్ట్..
బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికం అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. తెలంగాణ పోలీసుల ఇండియన్ పీనల్ కోడ్ అర్థం మార్చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ఎగ్జామ్ ప్రారంభమైన రెండు గంటల తర్వాత పేపర్ బయటికొస్తే లీక్ ఎలా అవుతుందని ప్రశ్నించారు రఘునందన్.. కాగా.. బొమ్మలరామారంలో పోలీసులు రఘునందన్ రావును అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు.. పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఆదిలాబాద్, పలు జిల్లాలో బీజేపీ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. బండి సంజయ్ అరెస్ట్ , పేపర్ లీకుల ఘటనలో ఆందోళనలకు దిగే అవకాశం ఉండటంతో అలర్ట్ అయ్యారు. ఆదిలాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ తో పాటు కార్యకర్తలను అరెస్ట్ చేసి, వన్ టౌన్ పోలీస్టేషన్‌కు తరలించారు. ఖమ్మంలో బిజెపి జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ తో పాటు బిజెపి నాయకులను హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు. బండి సంజయ్ అరెస్ట్ పై నిరసనలు చేపట్టకుండా హౌజ్ అరెస్ట్ చేశారు. అయితే బండి సంజయ్ ని అక్రమంగా అరెస్ట్ చేశారని గల్లా సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం..