డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తెలంగాణ డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. చివరి సెమిస్టర్ పరీక్షలను ఆన్ లైన్ లో నిర్వహించాలని ఎన్ఎస్ యూఐ, ఇతర పిటిషనర్లు వ్యాజ్యం వేయగా....

డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Follow us

|

Updated on: Sep 14, 2020 | 7:49 PM

తెలంగాణ డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. చివరి సెమిస్టర్ పరీక్షలను ఆన్ లైన్ లో నిర్వహించాలని ఎన్ఎస్ యూఐ, ఇతర పిటిషనర్లు వ్యాజ్యం వేయగా, ఆన్ లైన్ లో చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడం వీలు కాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్ సమస్య తలెత్తుతుందన్న ప్రభుత్వం.. పరీక్షలు రాయలేని విద్యార్థులు సప్లిమెంటరీ రాయవచ్చని సూచించింది. సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైనప్పటికీ రెగ్యులర్ గా పరిగణిస్తామని పేర్కొంది. అటానమస్ కాలేజీలకు మాత్రం ఆన్ లైన్ లో నిర్వహించేందుకు స్వేచ్ఛ ఇచ్చామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే, క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రమే ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహిస్తామని ఉస్మానియా యూనివర్శిటీ.. మిడ్ టర్మ్ పరీక్షలు ఆన్ లైన్ లో.. సెమిస్టర్ ఆఫ్ లైన్ లో నిర్వహిస్తామని జే ఎన్ టీయూహెచ్ పేర్కొన్నాయి. దీంతో ప్రభుత్వ విధానం గందరగోళంగా కనిపిస్తోందన్న హైకోర్టు.. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ఎదో ఒకే విధానం ఉండాలని అభిప్రాయపడింది. ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణ రేపటికి వాయిదా వేసింది.