ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారికి గుడ్‌న్యూస్.. ఇక పార్కింగ్ కోసం వెయిట్ చేయొద్దు.. జస్ట్ ఇలా చేయండి
వాహనదారులకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం యాజమాన్యం సూపర్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎయిర్‌పోర్టుకు వచ్చే ప్రయాణికులకు మరో అనుకూలమైన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రయాణికులు ఇంటి నుంచే తమ పార్కింగ్ స్లాట్‌ను ముందుగానే బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. పార్క్ ఎన్ ఫ్లై పేరిట ఈ నూతన సేవను విమానాశ్రయం యాజమాన్యం ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఎయిర్ పోర్టు పరిసరాల్లో పార్కింగ్ ఇబ్బందులను తగ్గించేందుకు యాజమాన్యం సరికొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. విమాన ప్రయాణికులు వచ్చి పార్కింగ్ కోసం వేచి ఉండకుండా, ముందుగానే ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుని నేరుగా నిర్ణీత పార్కింగ్ ప్రాంతంలో వాహనాన్ని పార్క్ చేసే విధంగా పార్ ఎన్ ప్లై అనే సేవలను అందుబాటులోకి తెచ్చింది. కస్టమర్ స్లాట్ బుక్ చేసుకున్న వెంటనే అతని ఇ-మెయిల్‌కు నిర్ధారణ వస్తుంది. అంటే ఇక మీ పార్కింగ్ స్లాట్ బుక్ అయినట్టే. ఇక మీరు ఏ టెన్షన్ లేకుండా ఎయిర్‌పోర్టుకు వెళ్లి అక్కడ మీ వాహనాన్ని పార్క్ చేసుకోవచ్చు. ఈ కొత్త సేవ ద్వారా ప్రయాణికులకు టైంతో పాటు పార్కింగ్ స్లాట్ దొరకదేమోనని ఆందోళన కూడా తగ్గనుంది.
ఇంటి నుంచే ప్లార్కింగ్ స్లాట్ ఎలా బుక్ చేయాలి?
మీరు ఇంటి నుంచే పార్కింగ్ స్లాట్ బుక్ చేసుకునేందకు మొదటగా RGIA అధికారిక వెబ్‌సైట్ hyderabad.aero లో ‘Park N Fly’ విభాగానికి వెళ్ళాలి. తర్వాత తేదీలు, వాహన వివరాలు నమోదు చేసి పార్కింగ్ స్లాట్ ఎంచుకోవాలి. తర్వాత మీకు వచ్చిన పేమెంట్‌ను ఆన్‌లైన్‌లో చెల్లించిన తర్వాత మీ స్లాట్ బుక్ అయినట్టు ఇ-మెయిల్ వస్తుంది. మీరు విమానాశ్రయానికి వెళ్ళినప్పుడు నేరుగా E-9 లేదా E-10 పార్కింగ్ జోన్‌కు వెళ్ళాలి. ఇ-మెయిల్ లేదా QR కోడ్ చూపించి వాహనాన్ని పార్క్ చేయవచ్చు.
పార్క్ ఎన్ ప్లై కోసం కొత్త జోన్‌లు
పార్కింగ్ జోన్లు పార్క్ ఎన్ ఫ్లై సేవ కోసం ప్రత్యేకంగా E-9, E-10 పార్కింగ్ జోన్‌లను కేటాయించారు. ఈ జోన్లు ముందు నుంచే బుక్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.విమానాశ్రయంలో మొత్తం 3,000 కి పైగా వాహనాలను పార్క్ చేసే సదుపాయాన్ని యాజమాన్యం కల్పించింది.
ఎయిర్‌పోర్టు చరిత్ర
ఈ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ నగర కేంద్రానికి సుమారు 24 కి.మీ దూరంలో శంషాబాద్‌లో ఉంది. 2008 మార్చిలో ప్రారంభమైన ఈ విమానాశ్రయం.. GMR గ్రూప్ యాజమాన్యంలో నడుస్తోంది. 2024-25 సంవత్సరంలో 2.9 కోట్లకు పైగా ప్రయాణికులు ఈ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించారు. ఇది దేశంలో నాలుగో అతిపెద్ద బిజీ విమానాశ్రయంగా గుర్తింపు పొందింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
