మంచిర్యాల కలెక్టర్, ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు, నిధుల దుర్వినియోగంపై ధర్మాసనం ఆగ్రహం
మంచిర్యాల జిల్లాలో అభివృద్ధి నిధుల దుర్వినియోగంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మంచిర్యాల కలెక్టర్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు..
మంచిర్యాల జిల్లాలో అభివృద్ధి నిధుల దుర్వినియోగంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మంచిర్యాల కలెక్టర్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. బెల్లంపల్లి నియోజకవర్గానికి మంజూరైన రూ.90 లక్షల డీఎంఎఫ్ టీ నిధుల దుర్వినియోగంపై స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జిల్లా పాలనాధికారి భారతి హోళికేరి, మరో అయిదుగురు అధికారులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.
నియోజకవర్గంలో నిధుల దుర్వినియోగంపై బీజేపీ మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి, నెన్నెల మండలం గొల్లపల్లి ఎంపీటీసీ సభ్యుడు బొమ్మెన హరీష్ గౌడ్ ఈనెల 6న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రజాధనం దుర్వినియోగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నియోజకవర్గం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు, కలెక్టర్ హోళికేరితో పాటు మరో ఐదుగురు అధికారులు నోటీసులు జారీ చేసింది.