Telangana: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. నగరాన్ని కమ్మేసిన నల్లని మేఘాలు..

Telangana: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుసింది. నగరాన్ని నల్లని మేఘాలు కమ్మేశాయి. కొన్ని చోట్ల మోసర్త వర్షాలు కురవగా..

Telangana: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. నగరాన్ని కమ్మేసిన నల్లని మేఘాలు..
Rains
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 26, 2021 | 5:22 PM

Telangana: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుసింది. నగరాన్ని నల్లని మేఘాలు కమ్మేశాయి. కొన్ని చోట్ల మోసర్త వర్షాలు కురవగా.. మరికొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. భారీ వర్షం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. మరోవైపు రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు జాగ్రత్త వహించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

ఎల్బీనగర్, నాగోల్, వనస్దలిపురం, బిఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్, పెద్ద అంబర్ పెట్, అబ్దుల్లా పుర్ మెంట్ పరిధిలలో భారీ వర్షం కురిసింది. అలాగే.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడింది. ఉదయం నుండి ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే, సాయంత్రానికి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు రావడంతో పాటు భారీ వర్షం మొదలైంది. వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, మరో రెండు రోజుల పాటు హైదరాబాద్ సహా తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

బుధవారం నాడు మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో కూడా భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, హిమాయత్ నగర్, నారాయణగూడ, అంబర్‌పేట, నాంపల్లి, లక్డీకపూల్, పంజాగుట్ట, దిల్‌సుఖ్ నగర్, కోఠీ తదితర ప్రాంతాలలో వర్షం దంచికొట్టింది. దాదాపు గంటపాటు నాన్‌స్టాప్‌గా వాన కురిసింది.

Also read:

Tomato Soup: రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే టేస్టీ టేస్టీ టమాటా సూప్ తయారీ.. అది ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు

E-Shram Portal: ఈ-శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి.. కార్మికులు తమ పేర్లను ఎలా నమోదు చేసుకోవాలంటే..

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి-బాబీ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. టైటిల్ ఫిక్స్ చేసిన మేకర్స్…

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి