Heat Wave Alert: సుర్రుమంటున్న సూరీడు.. ఈ టైంలో అస్సలు బయటకెళ్లకండి.. జాగ్రత్త బిగిలూ.!
యస్.. నేలపై సూరీడు నిప్పులు కురిపిస్తున్నట్టే ఉంది తెలుగురాష్ట్రాల్లో పరిస్థితి. భగభగ మండుతున్న ఎండలు మాడు మంటెక్కిస్తున్నాయి. ఉదయం 9 గంటలకే సూరీడు నిప్పులు చిమ్ముతుండటంతో జనం అల్లాడుతున్నారు. చాలాచోట్ల 40 డిగ్రీల టెంపరేచర్లు దాటిపోతున్నాయి. మరోవైపు వేడిగాలులు..

యస్.. నేలపై సూరీడు నిప్పులు కురిపిస్తున్నట్టే ఉంది తెలుగురాష్ట్రాల్లో పరిస్థితి. భగభగ మండుతున్న ఎండలు మాడు మంటెక్కిస్తున్నాయి. ఉదయం 9 గంటలకే సూరీడు నిప్పులు చిమ్ముతుండటంతో జనం అల్లాడుతున్నారు. చాలాచోట్ల 40 డిగ్రీల టెంపరేచర్లు దాటిపోతున్నాయి. మరోవైపు వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. ఉదయం ఎండ తీవ్రతతో వేర్వేరు పనులపై వెళ్లే వాళ్లంతా ఇబ్బంది పడుతున్నారు.
మధ్యాహ్నం 12 గంటలు దాటితే ప్రధాన రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. జాతీయ రహదారి సైతం వాహనాలు రాకపోకలు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉక్కపోతతో వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. సాధారణంగా ఏప్రిల్‌లో 40 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ ఇప్పుడు 40 డిగ్రీల టెంపరేచర్లు క్రాస్ అవుతున్నాయి. మే నెల అప్పుడే వచ్చేసిందా అన్నట్టుగా సూరీడు నిప్పులు చిమ్ముతున్నాడు. ఇప్పుడే ఎండ మంట ఇలా ఉంటే.. మేలో సిట్యువేషన్ ఏంటి? రోకలి బండలు పగలడం ఖాయమేనా అన్న అనుమానాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఎండే కదా అని అశ్రద్ధ చేస్తే వడదెబ్బ బారినపడటం ఖాయం. బయటకెళ్లే సమయంలో గొడుగు, టోపీ లాంటివి రక్షణగా తీసుకెళ్లాలి. వీలైనంత వరకు తెలుపు రంగు దుస్తులు ధరిస్తే ఎండ బారి నుంచి కాపాడుకోవచ్చు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు సమీపంలో ఉండే దుకాణాల దగ్గరకు వెళ్లి చల్లదనం ఎక్కువగా ఉండే శీతల పానీయం తాగేందుకు ప్రయత్నించకూడదు. ఎక్కువ చల్లదనం ఉండే పానీయం తాగే సమయంలో శరీర ఉష్ణోగ్రతలో తేడా వచ్చి ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది. మంచినీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు లాంటివి వెంట తీసుకెళ్లడం మంచిదని సజెస్ట్ చేస్తున్నారు డాక్టర్లు.
