NIGHT SHELTERS: వరంగల్ నగరంలో నైట్ షెల్టర్లు ఏర్పాటు చేస్తాం… మహా నగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి…
వరంగల్ నగరంలో నైట్ షెల్టర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి ప్రకటించారు...
వరంగల్ నగరంలో నైట్ షెల్టర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి ప్రకటించారు. ఇందు కోసం వరంగల్ నగరంలోని కూరగాయల మార్కెట్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలం, ఎల్‌బీ నగర్‌లోని ప్రభుత్వ స్థలం, ఇతర ప్రభుత్వ స్థలాలను కమిషనర్ క్షేత్రస్థాయిలో తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… వరంగల్ నగరంలో నైట్ షెల్టర్ల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాం. పట్టణ ప్రగతి నిధులతో సుమారు 50 మందికి రాత్రి బస కల్పించేందుకు కృషి చేస్తాం. ఇందుకోసం నైట్ షెల్టర్ల నిర్మాణాలను త్వరలో ప్రారంభిస్తాం. కాగా… కమిషనర్ వెంట తహసీల్దార్ ఇక్బాల్, బల్దియా డీఈలు సంజయ్, రవీందర్ తదితరులు ఉన్నారు.