AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాబందులకు జీపీఎస్ ట్రాకర్.. ఇది ఎవరి పని.. ఉలిక్కిపడ్డ బహిరాన్‌ దిబ్బ గ్రామస్తులు..!

మెదక్ జిల్లాలో ట్రాకర్ రాబందు సంచారం కలకలం రేపింది.. అల్లాదుర్గం మండలం బహిరాన్ దిబ్బ శివారులో జీపీఎస్ ట్రాకర్లు ఉన్న రాబందు ప్రత్యక్షమవడంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. రాబందు కాళ్లకు నంబర్లతో కూడిన స్టిక్కర్లు ఉండటాన్ని స్థానికులు గమనించారు. దీంతో అధికారులకు సమాచారం ఇచ్చారు.

రాబందులకు జీపీఎస్ ట్రాకర్.. ఇది ఎవరి పని.. ఉలిక్కిపడ్డ బహిరాన్‌ దిబ్బ గ్రామస్తులు..!
Gps Tagged Vulture
P Shivteja
| Edited By: |

Updated on: Jan 18, 2026 | 8:30 PM

Share

మెదక్ జిల్లాలో ట్రాకర్ రాబందు సంచారం కలకలం రేపింది.. అల్లాదుర్గం మండలం బహిరాన్ దిబ్బ శివారులో జీపీఎస్ ట్రాకర్లు ఉన్న రాబందు ప్రత్యక్షమవడంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. రాబందు కాళ్లకు నంబర్లతో కూడిన స్టిక్కర్లు ఉండటాన్ని స్థానికులు గమనించారు. దీంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే, అంతరించిపోతున్న రాబందుల కదలికలను గమనించేందుకే తామే జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేశామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.

ప్రకృతిని శుభ్రపరిచే నేచురల్ స్కావెంజర్స్ (రాబందుల) సంరక్షణ కోసం అటవీ శాఖ అధికారులు ముందడుగు వేస్తున్నారు. అంతరించిపోతున్న ఈ జాతిని కాపాడేందుకు చాలా చోట్ల అత్యాధునిక జీపీఎస్ ట్రాకర్లను రాబందులకు అమర్చుతున్నారు అటవీ శాఖ అధికారులు. వీటిని అమర్చడం వల్ల అసలు ఈ రాబందులు ఎక్కడికి వలస వెళ్తున్నాయి. ఏ ప్రాంతాల్లో ఆహారం తీసుకుంటున్నాయి. వాటి మనుగడకు ఎక్కడ ముప్పు పొంచి ఉంది. వంటి విషయాలను తెలుసుకోవడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు

ఇటీవల మహారాష్ట్రలోని తడోబా రిజర్వ్ నుండి విడుదల చేసిన ఒక రాబందు GPS సాయంతో ట్రాక్ చేయగా, అది ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు దాదాపు 4,000 కి.మీ ప్రయాణించినట్లు గుర్తించారు. ఒకవేళ ఏదైనా ప్రాంతంలో రాబందులు కదలకుండా ఒకే చోట ఉంటే, GPS డేటా ద్వారా అధికారులు వెంటనే స్పందించి కారణాలను విశ్లేషిస్తారు. శాస్త్రవేత్తలకు విలువైన సమాచారం ఈ ట్రాకర్ల ద్వారా సేకరించిన డేటా ఆధారంగా రాబందులకు ‘సేఫ్ జోన్లను’ (సురక్షిత ప్రాంతాలను) ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పక్షుల కదలికలను శాటిలైట్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తారు. ప్రకృతి సమతుల్యతలో కీలకమైన రాబందులను కాపాడుకోవడంలో ఈ ‘GPS ట్రాకర్లు’ గేమ్ ఛేంజర్‌గా మారనున్నాయి అంటున్నారు అధికారులు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?