Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హుస్సేన్ సాగర్‌ను శుభ్రపరచాలని ప్రభుత్వానికి సూచించిన గవర్నర్ తమిళిసై

హైదరాబాద్‌లో హుస్సెన్‌సాగర్ వద్ద జరిగిన సెయిలింగ్ వీక్ ముంగిపు ఉత్సవాలకు గవర్నర్ తమిళసై హాజరయ్యారు. సెయిలింగ్ పోటీల్లో మహిళలు కూడా పోటీపడటం సాధరాణ విషయం కాదని ఆమె అన్నారు. మహిళలు జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారని.. సెయిలింగ్ అనేది జీవిత పాఠాలను నేర్పుతుందని పేర్కొన్నారు.

Hyderabad: హుస్సేన్ సాగర్‌ను శుభ్రపరచాలని ప్రభుత్వానికి సూచించిన గవర్నర్ తమిళిసై
Telangana Governor Tamilisai Soundara Rajan
Follow us
Aravind B

|

Updated on: Jul 09, 2023 | 8:36 PM

హైదరాబాద్‌లో హుస్సెన్‌సాగర్ వద్ద జరిగిన సెయిలింగ్ వీక్ ముంగిపు ఉత్సవాలకు గవర్నర్ తమిళసై హాజరయ్యారు. సెయిలింగ్ పోటీల్లో మహిళలు కూడా పోటీపడటం సాధరాణ విషయం కాదని ఆమె అన్నారు. మహిళలు జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారని.. సెయిలింగ్ అనేది జీవిత పాఠాలను నేర్పుతుందని పేర్కొన్నారు. అలాగే హుస్సెన్‌సాగర్ చాలామంది ప్రతిభ గల సెయిలర్లను అందించిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో సెయిలింగ్ విభాగంలో భారత్‌కు పథకాలు వచ్చాయని తెలిపారు. రానున్న ఆసియా, ఒలంపిక్ క్రీడల్లో సెయిలింగ్‌లో మరిన్ని పథకాలు సాధించాలని ఆశిస్తున్నామని అన్నారు. తెలంగాణకి చెందిన మాన్యరెడ్డి ఏషియన్ సెయిలింగ్‌లో పోటీపడటం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.

అలాగే హుస్సేన్‌సాగర్‌పై కూడా తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. హుస్సేన్ సాగర్‌లో జాతీయ, అంతర్జాతీయ సెయిలర్లు సెయిలింగ్ చేస్తుంటారని.. కాబట్టి దిన్నీ శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో సహా ప్రజలపై కూడా ఉందని సూచించారు. గతంలో హుస్సేన్‌సాగర్లో సెయిలింగ్ చేసేటప్పుడు చేలు, కప్పులు కనిపిస్తుండేవని.. కానీ ఇప్పుడు కాలుష్యం వల్ల అవి ఏమి కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించి హుస్సెన్‌సాగర్‌ను శుభ్రపరచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా అని తెలిపారు. వచ్చే ఏడాదికి ఇలాంటి సమస్యలు ఉండకూడదని ఆశిస్తున్నానని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..