Telangana: మానవత్వానికి ప్రతిరూపం.. తాను మరణిస్తూ.. మరో నలుగురుకి జీవితాన్ని ఇచ్చిన ఖమ్మం మహిళ..
Organ Donation: ఆమె వెళ్తూ వెళ్తూ.. ఇతరులకు ప్రాణదానం చేశారు. తన అవయవదానంతో పది మందికీ ఆదర్శవంతంగా నిలిచారు. ఇంతకీ ఎవరామె? ఆమెకు జరిగిన ప్రమాదమేంటి?
Brain Dead: ధాతృత్వం చాటుకుందో మహిళ. చనిపోతూ.. నలుగురికి ప్రాణం పోసింది. గోరింకల ప్రమీల అనే ఈ మహిళ.. ఖమ్మం అర్బన్ లోని టేకులపల్లిలో నివాసముండేవారు.. రోడ్డు ప్రమాదంలో తలకు ఎడమ వైపు బలమైన గాయం తగిలి బ్రెయిన్ డెడ్ అయ్యింది. దీంతో ఆమె అవయవ దానం చేయడంతో.. ముగ్గురికి ప్రాణ దానం చేశారు.
ప్రమీల ఈ సమాజానికి ఆదర్శవంతంగా నిలిచారని కొనియాడారు పలువురు. ఆమె చేసిన అవయవదానం ఇందరికి ప్రాణం పోయడం గొప్ప విషయమనీ.. ఆమెలా అందరూ ఆలోచించాలనీ.. సూచిస్తున్నారు. ఇలాంటి ఉన్నత విలువలు కలిగిన వారు.. ఇలా అర్ధాంతర మరణం పాలవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని. ప్రమీల ఆత్మశాంతి జరగాలని దేవుడ్ని ప్రార్ధిస్తున్నట్టు చెప్పారు.. ఈ ఉదంతం విన్నవారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు ప్రతి ఒక్కరూ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..