Telangana: నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం.. క్లాస్‌రూమ్‌లోనే ఏడవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య.. చున్నీతో..

నాగర్‌కర్నూలు జిల్లాలో ఓ విద్యార్థిని క్లాస్ రూంలోనే ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని..

Telangana: నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం.. క్లాస్‌రూమ్‌లోనే ఏడవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య.. చున్నీతో..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 07, 2023 | 7:53 AM

నాగర్‌కర్నూలు జిల్లాలో ఓ విద్యార్థిని క్లాస్ రూంలోనే ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల – కళాశాలలో నిఖిత అనే విద్యార్థిని ఏడవ తరగతి చదువుతుంది. మూడు రోజుల క్రితం తోటి విద్యార్థులతో మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం పాఠశాల ఉపాధ్యాయులకు తెలియడంతో ఇద్దరు విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో కానీ బాలిక క్లాస్‌రూంలో ఆత్మహత్య చేసుకుంది. నిన్న సాయంత్రం తోటి విద్యార్థులంతా గ్రౌండ్‌లో ఉన్న సమయంలో ఒంటరిగా తరగతి గదిలోకి వెళ్లి చున్నితో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీస్తున్నారు.

విషయం తెలుసుకున్న విద్యార్థిని బంధువుల ఆందోళనకు దిగారు. క్లాస్ టీచర్ వేధింపులే విద్యార్ధిని ఆత్మహత్యకు కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్కూల్ లో జరుగుతున్న విషయాలపై ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన చర్యలు తీసుకోలేదని చెప్తున్నారు తోటి విద్యార్ధుల తల్లిదండ్రులు.

గ్రౌండ్ టైంలో ఇద్దరు విద్యార్థులు గొడవ పడ్డారు. దీంతో స్టూడెంట్ నిఖిత సూసైడ్ చేసుకుందని చెప్తున్నారు ప్రిన్సిపాల్. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. బాలిక ఎందుకు చనిపోయింది.. దీనికి వెనుక ఉన్న కారణమేంటీ అనేది.. పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తుందని పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే