తెలంగాణ: రామమందిర నిర్మాణం కోసం నిధుల సేకరణ.. 21 రోజుల పాటు రాజకీయ కార్యక్రమాలు రద్దు..

Funds Raising For Ram Mandir: రామమందిర నిర్మాణంలో భాగంగా రేపటి నుంచి ఫిబ్రవరి 10 వరకు నిధులు సేకరణ చేపట్టనున్నట్లు విశ్వహిందూ...

  • Ravi Kiran
  • Publish Date - 8:03 pm, Tue, 19 January 21
తెలంగాణ: రామమందిర నిర్మాణం కోసం నిధుల సేకరణ.. 21 రోజుల పాటు రాజకీయ కార్యక్రమాలు రద్దు..
Ram Mandir

Funds Raising For Ram Mandir: రామమందిర నిర్మాణంలో భాగంగా రేపటి నుంచి ఫిబ్రవరి 10 వరకు నిధులు సేకరణ చేపట్టనున్నట్లు విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ వెల్లడించారు. 20 రోజుల పాటు ‘శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్’ పేరిట సాగనున్న ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులందరూ పాల్గొంటారని ఆయన తెలిపారు.

ఈ నేపధ్యంలోనే రేపటి నుండి 21 రోజుల పాటు అన్ని రాజకీయ కార్యక్రమాలను రాష్ట్ర బీజేపీ రద్దు చేసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా 9 వేల గ్రామాల్లోని ప్రతీ ఇంటిని శ్రీరామ మందిర నిర్మాణంలో భాగం చేస్తామని.. సుమారు మూడు కోట్లకు పైగా హిందువులను ప్రత్యక్షంగా కలుస్తామని రావినూతల శశిధర్ తెలిపారు.

ఇవి చదవండి:

స్టీవ్ స్మిత్‌ను ఆట ఆడుకున్న రోహిత్ శర్మ.. సేమ్ సీన్ రిపీట్.. హిట్‌మ్యాన్ కామెడీ అదుర్స్…

అరుదైన రికార్డు సాధించిన హైదరాబాదీ.. సిరాజ్‌కు సలాం కొడుతోన్న నెటిజన్లు..