Jeevan Reddy : పార్టీలో కొనసాగడంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచిస్తున్నానన్నారు. తన రాజకీయ భవిష్యత్తు ఏంటో తెలియడం లేదన్నారు. పార్టీలో ఇంకెంత కాలం అవమానాలు భరించాలని ప్రశ్నించారు. సంజయ్‌ ఉన్నంత వరకు తమకు ఈ వేధింపులు తప్పవన్నారు.

Jeevan Reddy : పార్టీలో కొనసాగడంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Jeevan Reddy Congress

Updated on: Feb 17, 2026 | 12:01 AM

మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచిస్తున్నానన్నారు. తన రాజకీయ భవిష్యత్తు ఏంటో తెలియడం లేదన్నారు. పార్టీలో ఇంకెంత కాలం అవమానాలు భరించాలని ప్రశ్నించారు.ఎన్నికల ముగింపు కాదు సంజయ్‌ ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు తమకు ఈ వేధింపులు తప్పవన్నారు.

పవర్ ఆఫ్ అటార్నీ ఎమ్మెల్యే సంజయ్‌కు రాసిచ్చారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు జగిత్యాల కాంగ్రెస్ పట్టా రాసిచ్చారని.. స్పీకర్ ఏమో ఎమ్మెల్యే పార్టీ మారలేదు అంటున్నాడు.. ఎమ్మెల్యే సంసారం మాత్రం కాంగ్రెస్ పార్టీతో చేస్తున్నాడన్నారు. అధినాయకత్వం కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు గౌరవించాలని.. జగిత్యాల్లోనే ఇలా ఉంటే పార్టీ మారిన మరో 9 ప్రాంతాల్లో ఎలా వుందోనన్నారు.

జీవన్ రెడ్డి ఏమన్నారో చూడండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us